Begin typing your search above and press return to search.

శృతి హాసన్ తప్పుకుందట!!

By:  Tupaki Desk   |   29 May 2017 1:08 PM GMT
శృతి హాసన్ తప్పుకుందట!!
X
బాహుబలి2 సాధించిన ఘనవిజయం చాలామందికే ఫ్యాంటసీ మూవీస్ పై స్ఫూర్తిని ఇచ్చింది. కానీ బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కాక ముందే.. ఆ స్థాయి చిత్రం అంటూ తమిళంలో ఓ మూవీపై అనౌన్స్ మెంట్ వచ్చింది. తాజాగా కేన్స్ లో సంఘమిత్ర ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రారంభించేశారు కూడా. అంతే కాదు ఫస్ట్ లుక్స్ తో హంగామా కూడా చేశారు.

సంఘమిత్ర అనే టైటిల్ పై శృతి హాసన్ హీరోయిన్ గా 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఓ సినిమా తీస్తామన్నాడు దర్శకుడు సుందర్ సి. అయితే.. ఇప్పుడీ ప్రాజెక్టు ప్రారంభమై ఇంకా 10 రోజులు కూడా కాకముందే ఎదురు దెబ్బ తగిలేసింది. ప్రధాన పాత్రధారిణి.. టైటిల్ రోల్ పోషించాల్సిన శృతి హాసన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై అనౌన్స్ మెంట్ రాకపోయినా.. శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుందని కోలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది.

శృతి అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటో తెలియరాలేదు. ఇప్పటికే ఈమెకు కత్తి సాము.. గుర్రపు స్వారీ వంటివి తర్ఫీదు ఇచ్చేందుకు భారీగానే వెచ్చించారు మేకర్స్. సుదీర్ఘంగా కాల్షీట్స్ ఇచ్చే మరో హీరోయిన్ ను వెతుక్కునే వరకూ సంఘమిత్ర పరిస్థితి అగమ్యగోచరమే అని చెప్పచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/