Begin typing your search above and press return to search.

ఆ ఒక్కటి అడక్కండి అంటున్న శ్రేయ

By:  Tupaki Desk   |   18 March 2018 9:41 AM GMT
ఆ ఒక్కటి అడక్కండి అంటున్న శ్రేయ
X
నిన్న దాదాపు మీడియా మొత్తం కవర్ అయిన టాపిక్ శ్రేయ పెళ్లి. గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 12న ముంబైలో పరిమిత అతిధుల మధ్య చాలా గుట్టుగా పెళ్లి జరిగిపోయిందని, ఒక్క మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ తప్ప సినిమా ఫీల్డ్ నుంచి ఇంకెవరు రాలేదని రకరకాల కథనాలు ప్రచారం అయ్యాయి. కాని శ్రేయ దీని గురించి మాట్లాడ్డానికి ఇష్టపడటం లేదు. నిజంగా పెళ్లి జరిగిందా లేదా అని పలు మీడియా ప్రతినిధులు సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు దాని గురించి కామెంట్ చేయలేనని చెప్పి స్మార్ట్ గా తప్పించుకుందట. ఖండించలేదు అంటే తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీతో పెళ్లి జరిగడం నిజమే కాబోలు అనే వార్త జోరందుకుంది.

ఇప్పుడు తన పెళ్లి వార్త అర్జంట్ గా బయట పెట్టేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమి లేదు కనక శ్రేయ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండాలనే డిసైడ్ అయ్యిందట. శ్రేయ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో చేస్తోంది. ఒకటి వీరభోగవసంతరాయలు కాగా రెండోది ఆటా నాదే వేటా నాదే. వీటితో పాటు మరో ప్రాజెక్ట్ సైన్ చేయడానికి రెడీ అవుతోందట. ఈ నేపధ్యంలో పెళ్లి గురించి ప్రచారం చేసుకుని దానికి ప్రాధాన్యం ఇవ్వడం కంటే గప్ చుప్ గా సినిమాల మీదే దృష్టి పెట్టడం మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్. తననే నేరుగా అడిగినప్పుడు అబ్బే అలాంటిది ఏమి లేదు పెళ్లి చేసుకుంటే మీకు చెప్పనా అని బదులు ఇచ్చి ఉంటే చర్చ అవసరం పడేది కాదు. అలా కాకుండా కామెంట్ చేయలేను అని చెప్పడం చూస్తే అనుమానం బలపడక మానదు,