Begin typing your search above and press return to search.

శ్రీయ-ఆండ్రీవ్.. ఎన్నెన్ని ముద్దులో!!

By:  Tupaki Desk   |   21 March 2018 4:45 PM GMT
శ్రీయ-ఆండ్రీవ్.. ఎన్నెన్ని ముద్దులో!!
X
అసలు తనకు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యమే లేదని ఓ నెల క్రితం చెప్పింది సెక్సిణి శ్రీయ సరన్. మా అమ్మాయి కేవలం ఉదయపూర్ లో ఒక ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం షాపింగ్ చేస్తోంది అని చెప్పింది ఆమె తల్లి నీరజ. శ్రీయ లైఫ్‌ లో అసలు అబ్బాయిలే లేరు అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆమె పిఆర్ టీమ్. కాని ఫైనల్ గా రూమర్లను నిజం చేస్తూ.. మూడ్నెళ్ళ క్రితం మారిషస్ లో స్కూబా డైవింగ్ క్లాసుల్లో పరిచయం అయిన అదే ఫారిన్ కుర్రాడు ఆండ్రీవ్ కొశ్చీవ్ ను అదే ఉదయపూర్ లో అమ్మడు పెళ్లి చేసుకుంది. మీడియాకు సాకులు చెప్పడం.. ముచ్చటగా మూడు ముళ్లూ వేయించుకోవడం ఈ మధ్యన హీరోయిన్లకు ట్విట్టర్ తో పెట్టిన విద్య తరహాలో తయారైందిలే.

అయితే ఇప్పుడు శ్రీయ పెళ్ళి వీడియోలు.. సంగీత్ సిడిలు.. రిసెప్షన్ ఎంఎంఎస్ లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కాకపోతే అన్ని ఫోటోల్లోనూ వీడియోల్లోనూ ఒకటి మాత్రం కామన్ గా కనిపిస్తోంది. రష్యన్ పెళ్ళికొడుకు 'ట్రూ లవ్' అంటూ ఒక రెండు మాటల చెప్పగానే.. పుచిక్ మని పెదాల ముద్దు పెట్టేసింది శ్రీయ. అలాగే మరో చోట ఇద్దరూ కలసి డ్యాన్స్ ఫ్లోర్ మీద స్టెప్పులేస్తూ.. పుచిక్ అని మరోసారి పెదాలను కలిపేశారు. మరో ఫోటోలు సూట్లో ఉన్న ఆండ్రీవ్.. తన ప్రేయసికి చపక్ అని ఇంకోటి పెట్టేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుల ఫోటోలన్నీ తెగ రచ్చ చేస్తున్నాయి. శ్రీయ ముద్దులు కొత్తకాదులే కాని.. ఇక ఆ ముద్దులన్నీ అతడికే పరిమితం అనే ఐడియానే చాలామందికి కాస్త ఇబ్బందిని కలిగిస్తోంది. ఏం కుర్రాళ్ళూ.. ఇంక చాల్లే మీ పరాచికాలు. శ్రీయ బ్యాచిలర్ లైఫ్ ఈజ్ ఓవర్!!