Begin typing your search above and press return to search.

శ్రియకు ఎందుకంత డిమాండో తెలుసా?

By:  Tupaki Desk   |   14 May 2017 5:48 AM GMT
శ్రియకు ఎందుకంత డిమాండో తెలుసా?
X
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టీ దేవి పాత్రతో తన ట్యాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో శ్రియ మరోసారి ప్రూవ్ చేసింది. యాక్టింగ్.. డ్యాన్సింగ్ స్కిల్స్ లో తిరుగులేని ఆధిపత్యం చూపించే శ్రియా శరణ్.. ప్రస్తుతం హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్నవారిలో సీనియర్ మోస్ట్ అనేయచ్చు.

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం చిత్రం కోసం.. తాజాగా హైద్రాబాద్ వచ్చింది శ్రియ. ఓ ఐటెం సాంగ్ కు చిందులు వేసేసి తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ మరోసారి చూపించింది. రాజుసుందరం అందించిన కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. మరోవైపు పనిలోపనిగా హైద్రాబాద్ లో మరికొన్ని షాప్ ఓపెనింగ్స్ ను కూడా పూర్తి చేసేస్తోంది శ్రియ. ఇలాంటి ఓపెనింగ్స్ కు లక్షల్లో హీరోయిన్లకు చదివించుకోవాలనే సంగతి తెలిసిందే. కొత్త తారలు ఎంతమంది ఉన్నా.. శ్రియకు ఇలాంటి ఆఫర్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇందుకు కారణం శ్రియ బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు.

హీరోయిన్స్ తో ఓ రిబ్బన్ కటింగ్ డీల్ సెట్ చేసే మధ్యవర్తులకు.. ఆయా షాపుల వాళ్లు అంతో ఇంతో చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. వారి కంటే ఎక్కువగా తన రెమ్యూనరేషన్ లో 10-15 శాతం అమౌంట్ ను ఈ మధ్యవర్తులకు చెల్లిస్తూ ఉంటుందిట శ్రియ. అలాంటి పెద్ద చెక్కులు అందుతుండడంతోనే.. శ్రియ చేతికి ఇంకా ఇన్నేసి డీల్స్ అందుతున్నాయని అంటున్నారు.