Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్‌' లో మరో రెండు సర్‌ ప్రైజ్‌ లు..!

By:  Tupaki Desk   |   13 Nov 2018 8:52 AM GMT
ఎన్టీఆర్‌ లో మరో రెండు సర్‌ ప్రైజ్‌ లు..!
X
బాలకృష్ణ - క్రిష్‌ ల కాంబినేసన్‌ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంటుంది. సంక్రాంతికి ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ విడుదలకు సిద్దం అవుతోంది. రిపబ్లిక్‌ డేకు ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ విడుదల కావాల్సి ఉంది. రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ ను డిసెంబర్‌ రెండవ లేదా మూడవ వారం వరకు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్స్‌ ను నటింపజేస్తున్న దర్శకుడు క్రిష్‌ మరో కీలక పాత్ర కోసం శ్రియను ఈ చిత్రంలో నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్‌ కెరీర్‌ లో ఎప్పటికి నిలిచిపోయే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంకు సంబంధించిన కొన్ని సీన్స్‌ ‘ఎన్టీఆర్‌’ మూవీలో ఉండబోతున్నారట. అందుకే ఆ సీన్స్‌ కోసం కీలక పాత్రలో శ్రియ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. శ్రియతో దాన వీర శూర కర్ణ చిత్రం ఎపిసోడ్‌ లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కూడా కనిపించబోతున్నాడట. అప్పట్లో హరికృష్ణ ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో అర్జునుడి పాత్రను పోషించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో కళ్యాణ్‌ రామ్‌ అర్జునుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ రెండు సర్‌ ప్రైజ్‌ లను క్రిష్‌ ఇంకా రివీల్‌ చేయలేదు. త్వరలోనే ఆ పాత్రలకు సంబంధించిన లుక్‌ లను విడుదల చేయనున్నాడు. బాలయ్య - క్రిష్‌ ల గత చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో శ్రియ కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి ఈ కాంబోలో శ్రీయ నటించబోతున్న కారణంగా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో లీడ్‌ రోల్స్‌ లో విద్యాబాలన్‌ - రానా - సుమంత్‌ - నిత్యామీనన్‌ - తమన్నా - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకా పలువురు కనిపించబోతున్న విషయం తెల్సిందే.