Begin typing your search above and press return to search.

శ్రియ ఎక్కడినుంచి వస్తుందో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Jan 2018 11:06 AM GMT
శ్రియ ఎక్కడినుంచి వస్తుందో తెలుసా?
X
టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ కు ఇప్పటికీ క్రేజ్ ఉండడానికి అసలు సిసలైన కారణం.. వన్నె తరగకుండా తన అందాన్ని మెయింటెయిన్ చెయ్యడమే. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి వెలుగులు మొహంలో కనిపించకపోయినా.. వయసు తెచ్చే పరిణతి మాత్రం శ్రియ ఫేస్ లో గోచరిస్తుంది. అలాగని ఈ వయసు శ్రియ సొగసులను మాత్రం తగ్గించలేకపోతోంది. అందుకే ఇప్పటికీ వరుసగా సినిమాలు చేయగలుగుతోంది ఈ బ్యూటీ.

దేశం మొత్తం మీద అనేక భాషల్లో నటించడమే కాదు.. ఇంగ్లీష్ సినిమాల్లో చేసిన ఎక్స్ పీరియన్స్ కూడా ఈమెకు ఉంది. 2008లో ది అదర్ ఎండ్ అఫ్ ది లైన్.. 2009లో కుకింగ్ విత్ స్టెల్లా.. 2012లో మిడ్ నైట్స్ చిల్డ్రన్ మూవీస్ లో నటించిన శ్రియ.. ఇప్పుడు మరో ఇంగ్లీష్ మూవీకి రెడీ అయిపోతోంది. సుజన అనే డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో.. శ్రియదే లీడ్ రోల్. ఓ పట్టణంలోని స్లమ్ లో పుట్టి పెరిగిన ఓ మహిళ.. వర్కింగ్ ఉమన్ గా ఎదుర్కున్న కష్టాలు.. ఆమె జీవితమే ఈ చిత్రానికి ఇతివృత్తం. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండడం ఈ చిత్రానికి హైలైట్ గా చెప్పాలి.

ఈ సినిమాలో గతంలో ఎన్నడూ కనిపించని కొత్త కోణంలో శ్రియ లుక్ ఉంటుందని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ గా జ్ఞానశేఖర్ కెమేరా వర్క్ చేస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే స్టోరీ బోర్డ్ పూర్తికాగా.. మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. మార్చ్ చివరకు షూటింగ్ ప్రారంభిస్తామని డైరెక్టర్ సుజన తెలిపారు.