Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా శ్రీయ పెళ్ళి అయిపోయిందా??

By:  Tupaki Desk   |   17 March 2018 7:02 AM GMT
సీక్రెట్ గా శ్రీయ పెళ్ళి అయిపోయిందా??
X
తెలుగు త‌మిళ భాష‌లతో పాటూ హిందీలోనూ మెరిసింది శ్రియ శ‌ర‌ణ్‌. ఒక‌ప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. చిరు వెంకీ నాగార్జున బాల‌కృష్ణ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హేష్ బాబు ఇలా పెద్ద హీరోలంద‌రి ప‌క్క‌న న‌టించింది. సీనియ‌ర్ హీరోయిన్ అయ్యాక కొత్త హీరోయిన్ల రాక‌తో కాస్త ప‌క్క‌కు త‌ప్పుకుంది శ్రియ‌. ఇప్ప‌టికీ ఆమెకు అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టించింది శ్రియ‌. అయితే శ్రియ త‌న బాయ్ ఫ్రెండ్‌ను ర‌హస్యంగా వివాహం చేసుకున్న‌టు స‌మాచారం.

ఆమె పెళ్లి ఉద‌య్‌ పూర్లో అంగ‌రంగ వైభవంగా జ‌రుగ‌నుంద‌ని మొద‌ట వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రియ పెళ్లి ఇప్ప‌టికే అయిపోయింది. ముంబైలోని అంధేరీలో ఉన్న త‌న ఇంట్లోనే మార్చి 12న ర‌ష్య‌న్ అబ్బాయి ఆండ్రీ కోస్‌ చీవ్‌ ని పెళ్లి చేసుకుంద‌ట శ్రియ‌. ఈ పెళ్లికి శ్రియ త‌రుపు బంధువులు... ఆండ్రీ త‌ర‌పు బంధువులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని స‌మాచారం. సినిమా ఇండ‌స్ట్రీ నుంచి మ‌నోజ్ బాజ్ పేయ్ అత‌ని భార్య ష‌బానా వ‌చ్చార‌ట‌. వారు శ్రియ ఇంటికి ద‌గ్గ‌ర్లోనే ఉంటార‌ట‌. అందుకే వారిని పిలిచార‌ని స‌మాచారం. ఇంట్లోనే ఎలాంటి హంగామా లేకుండా శ్రియ పెళ్లి చేసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

శ్రియ పెళ్లి హిందూ సాంప్ర‌దాయ ప్ర‌కారం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఆమె పెళ్లి రోజును గులాబీ రంగు చీర‌లో మెరిసింద‌ట‌. మార్చి 11న ప్రీ వెడ్డింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించార‌ట శ్రియ ఆండ్రీ. గ‌త ప‌ద్దెనిమిదేళ్లుగా సినిమాల‌లో న‌టిస్తోంది శ్రియ. 37 ఏళ్ల వ‌య‌సులో ఇప్పుడు పెళ్లి కూతురైంది. ర‌ష్య‌న్ క్రీడాకారుడు రెస్టారెంట్ల‌కు య‌జ‌మాని అయినా ఆండ్రీ శ్రియ మ‌ధ్య ప్రేమ ప్రయాణం చాలా నెల‌లుగా సాగుతోంది. కానీ ఆ విష‌యం గురించి వారిద్ద‌రూ ఎక్క‌డా నోరు విప్ప‌లేదు.