అందాలు ఆరబోసినా పద్దతే అనాలట

Tue Sep 12 2017 05:00:01 GMT+0530 (IST)

ఈ మధ్య కాలంలో కొంత మంది హీరోయిన్స్ మొదటి సినిమాలో ఉన్నట్టుగా మరికొన్ని సినిమాల తర్వాత ఉండటం లేదు. ఓ నాలుగైదు సినిమాలు అయిపోగానే చీర నుంచి బికినీ వరకు మారిపోతున్నారు. ఇక బయట కూడా పద్దతిగా కనిపించే భామలు కాలం మారిన మారుతున్న కొద్దీ అందరిని ఆకర్షించే విధంగా కొన్ని స్కిన్ షో డ్రెస్సులతో దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఫోటో షూట్స్ ఈ మధ్య హీరోయిన్స్ తెగ హల్ చల్ చేస్తున్నారు.  దీంతో కొంతమంది వారిపై వల్గారిటీ గా నెగిటివ్ కామెంట్స్ చేస్తుండడంతో కొందరు భామలు సీరియస్ అవుతున్నారు.చీర కట్టుతో కనిపిస్తే మరి పద్దతిగా అనేస్తారు.. అలాగే కాస్త మోడ్రన్ దుస్తులతో కనిపిస్తే వల్గారిటీ అంటారు. ఇదెక్కడి గోలా దేవుడా అని వాపోతున్నారు. అదే తరహాలో హీరయిన్ శ్రీయ తెగ ఇబ్బందిపడిపోతుందట. రీసెంట్ గా అమ్మడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వల్గారిటీ - గ్లామర్ కి మధ్యలో ఒక చిన్న తేడాని గమనిస్తే చాలా మంచిదని పాఠాలు చెప్పింది. "మేం ఎప్పుడైనా ఒకేలా ఉంటాం.. అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం..పద్దతిగా కనిపించినా  మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించినా అందంగా కనిపించడం కోసమే.. సో అందులో వల్గారిటీ ఎక్కడ ఉంది. కాబట్టి మాలో తేడా ఏం లేదు కేవలం చూసే కళ్ళల్లోనే తేడా ఉంది. అదే విధంగా చీరలో కనిపిస్తే మంచిదని మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తే వల్గారిటీగా ఉందని లేని పోనీ ఆరోపణలతో క్యారెక్టర్ పై ఓ ముద్ర వేసేస్తారు'' అంటోంది అమ్మడు.

అయితే అమ్మడి కామెంట్స్ విన్న తర్వాత  అందం అనేది ఎంతవరకు ఆరబోస్తే కరెక్ట్ గా ఉంటుందో ఓ అమ్మాయికి తెలియకుండా ఉంటుందా? అనే కామెంట్స్ వినబడుతున్నాయి.