Begin typing your search above and press return to search.

గదిలో అలా చేయడం కష్టమే, కాని తప్పదు

By:  Tupaki Desk   |   19 Oct 2018 10:49 AM GMT
గదిలో అలా చేయడం కష్టమే, కాని తప్పదు
X
తెలుగులో పుష్కర కాలంగా హీరోయిన్‌ గా కొనసాగుతూ వస్తున్న శ్రియ తాజాగా ‘వీరభోగ వసంత రాయులు’ అనే చిత్రాన్ని చేసింది. ఈ చిత్రంలో నారా రోహిత్‌ - సుధీర్‌ బాబు - శ్రీవిష్ణులు హీరోలుగా నటించిన విషయం తెల్సిందే. ముగ్గురు హీరోలతో పాటు ఈ చిత్రంలో శ్రియకు కూడా చాలా ముఖ్యమైన పాత్ర దక్కింది. దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంను వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా శ్రియ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాను వెళ్లడి చేసింది. తన కెరీర్‌ లో ఇప్పటి వరకు చేయని విభిన్నమైన పాత్రను చేయడం జరిగిందని, తప్పకుండా ఈ చిత్రంలోని నా పాత్రను అంతా ఆధరిస్తారంది. నా పాత్ర సీరియస్‌ గా - చాలా స్ట్రాంగ్‌ గా ఉంటుందని - ఈ చిత్రంలో నటించడం వల్ల ఒక మంచి సినిమా చేశాననే తృప్తి నాకు కలిగిందని శ్రియ చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలోని పాత్ర కోసం సిగరెట్‌ మరియు మందు కొట్టే సీన్స్‌ లో నటించాల్సి వచ్చిందని శ్రియ చెప్పుకొచ్చింది.

మందు కొట్టే విషయం పక్కన పెడితే సిగరెట్‌ తాగడం తనకు చాలా ఇబ్బంది అయ్యిందని - సిగరెట్‌ సీన్స్‌ ముందే చాలా ప్రాక్టీస్‌ చేశానంది. అయితే రూంలో సిగరెట్‌ సీన్‌ ఉండటం వల్ల రూం అంతా కూడా సిగర్‌ స్మోక్‌ నిండి పోయి - అందరం ఇబ్బంది పడేవాళ్లమని - గదిలో సిగరెట్‌ స్మోక్‌ చేస్తూ సీన్‌ లో నటించడం అంటే మామూలు విషయం కాదు, కాని తప్పని పరిస్థితుల్లో - పాత్ర చాలా స్ట్రాంగ్‌ గా రావాలనే ఉద్దేశ్యంతో అలా నటించాల్సి వచ్చిందని, ఆ కష్టం అంతా కూడా సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తే పోతుందని శ్రియ పేర్కొంది.