Begin typing your search above and press return to search.

ఈ నడుమందాల సుంద‌రికి అప్పుడే 36 ఏళ్లా?

By:  Tupaki Desk   |   12 Sep 2017 6:48 AM GMT
ఈ నడుమందాల సుంద‌రికి అప్పుడే 36 ఏళ్లా?
X
తింటే గారెలే.. తినాలి.. వింటే భారతమే వినాలి అని సామెతండి.దీన్నే ఇప్పుడు కొంచెం మారుద్దామండీ. చూస్తే శ్రియ నడుమునే చూడాలి.. ఆస్వాదిస్తే ఆమె అందాలనే ఆస్వాదించాలి. ఇప్పుడిదంతా ఎందుకంటారా? విషయం ఉందండీ.. తన నడుమందాల నాజూకు షోకులతో కుర్రకారును ఈ నాటికీ కిర్రెక్కిస్తోన్న అందాల తార శ్రియా శరణ్ నేడు 36వ వసంతంలోకి అడుగిడుతోందండీ.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పర్వత సోయగాల మధ్య పెరిగిన ఈ జఘన సొగసు సుందరి తర్వాత ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. డిగ్రీ చదివేటప్పుడే లెక్చరర్ కోరిక మేరకు మొదటిసారిగా ఒక డ్యాన్స్ వీడియోలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. 19 ఏళ్ల వయసులో 2001లో తొలిసారిగా తెలుగు చిత్రం 'ఇష్టం'లో నటించి అందరినీ తనను ఇష్టపడేలా చేసింది. తర్వాత సంతోషం సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ టాప్ హీరోస్ అదేనండి మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకు - బాలయ్య నుంచి విక్టరీ వెంకటేశ్ వరకు - తరుణ్ నుంచి ప్రభాస్ వరకు దాదాపు అందరి హీరోలతో తెర పంచుకుంది.

ఇలా 17 ఏళ్ల నుంచి తన నాజూకు నడుమందాలతో రస ప్రియులకు నిద్ర లేకుండా చేసింది.. చేస్తోంది. తెలుగుకే పరిమితం కాకుండా తమిళంలోనూ ఈ అమ్మడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ - విజయ్ - విక్రమ్ వంటి టాప్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుందండి. తెలుగు - తమిళమే కాకుండా దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లోనూ అలరించిందీ జఘన సుందరి. బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో వాశిష్ఠిగా తన నటనతో గిలిగింతలు పెట్టింది.. ఈ నేరేడు కళ్ల పాప. బాలా 101వ చిత్రం 'పైసా వసూల్'లోనూ నాయికగా అలరించింది శ్రియ. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుంటూ మనలాంటి రస హృదయులను తన కైపెక్కించే నడుమందాలతో అలరించాలని ఆశిద్దాం.