Begin typing your search above and press return to search.

చరణ్‌ అండ్ శ్రీయ.. రక్తి కట్టించారు

By:  Tupaki Desk   |   25 July 2017 5:29 AM GMT
చరణ్‌ అండ్ శ్రీయ.. రక్తి కట్టించారు
X
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా కాకుండా నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి రామ్ చరణ్ తేజ్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కేవలం వారసత్వమే అర్హత కాకుండా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు యాక్టింగ్ - డ్యాన్ - ఫైట్స్ లలో శిక్షణ తీసుకున్నాడు. మొదటి సినిమా చిరుత అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్నాడు.

రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చేముందు ముంబయిలోని ఓ ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రియ సరన్ ఆ ఇన్ స్టిట్యూట్ ను విజిట్ చేసింది. యంగ్ స్టర్స్ లో ఉత్సాహం నింపేందుకు ఇన్ స్టిట్యూట్ నిర్వాహకులు ఆమెను ప్రత్యేక అతిథిగా అక్కడకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ - శ్రియ కలిసి ఓ సీన్ పెర్ఫార్మ్ చేశారు. దశాబ్దం క్రితమే జరిగిన ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో దర్శనమిస్తోంది. ఇందులో రామ్ చరణ్ నల్లకోటు వేసుకుని... కళ్లజోడు పెట్టుకుని పొడిపొడి మాటలు మాట్లాడుతూ ఒకింత నెర్వస్ గా కనిపించాడు. శ్రియ అప్పటికే టాప్ యాక్టర్ కావడంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తూనే యాక్టింగ్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టేసింది. రొమాంటిక్ సన్నివేశాన్ని ఇద్దరూ మొత్తానికి చక్కగానే రక్తి కట్టించారు.

ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చేపాటికి శ్రియ సినిమాల్లో నటిస్తూనే ఉన్నా ఏ ఒక్క సినిమాలోనూ ఆన్ స్క్రీన్ పై వీరిద్దరూ కలిసి నటించలేదు. కానీ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి - అతడి బాబాయి పవన్ కళ్యాణ్ ఇద్దరి పక్కన ఆమె హీరోయిన్ గా నటించింది. మొత్తానికి యూట్యూబ్ పుణ్యమా అని ఆ రోజుల్లో వీళ్లిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉందో తెలిసింది.