Begin typing your search above and press return to search.

శ్రీయ అలా కనిపించడం లేదట

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:17 PM GMT
శ్రీయ అలా కనిపించడం లేదట
X
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరోయిన్స్ లలో శ్రీయ సరన్ ఒకరు. అమ్మడు తెలుగులో. దాదాపు స్టార్ హీరోలందరితో నటించేసింది. అంతే కాకుండా కుర్ర హీరోల తో కూడా నటించేసి తనకు తానే పోటీ అనేలా చాలా వైవిధ్యమైన సినిమాలను కూడా చేసింది. ఇక శ్రియ గ్లామర్ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల సొగసరి అందాలను మెయింటైన్ చేస్తోంది.

ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమి పుత్ర శతకర్ణి సినిమాలో నటించి ఆ తర్వాత అయిన తోనే పైసా వసూల్ యాక్షన్ మూవీని చేసింది. ఆ సినిమాల తర్వాత అమ్మడు కొన్నిమాంచి ఆఫర్స్ ను అందుకుంటోంది. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక భారీ యాక్షన్ మూవీలో శ్రియ చాలా కొత్త క్యారెక్టర్ చేయబోతోందట. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ నరేన్ తెరకెక్కిస్తోన్న నరగసూరన్ అనే సినిమాలో శ్రీయ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సందీప్ కిషన్ - అరవింద్ స్వామి అలాగే ఆత్మిక ప్రదాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

అయితే సినిమాలో శ్రీయ అరవింద్ స్వామికి జోడిగా కనిపించనుందట. గత కొంత కాలంగా ఈ సినిమా పై కోలీవుడ్ లో అనేక రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో శ్రియ చాలా హాట్ గా ఉంటుందని గ్లామర్ గర్ల్ గా కనిపించనుందని చెప్పారు. కానీ రీసెంట్ గా దర్శకుడు కార్తిక్ అమ్మడి క్యారెక్టర్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో శ్రియ అస్సలు గ్లామర్ గా కనిపించిందని కాకపోతే ఆమె క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పాడు. ఆ పాత్రలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా తెరకెక్కించే ముందు అరవింద్ స్వామికి జోడిని సెట్ చేయడానికి చాలా మందిని చూశాం. ఫైనల్ గా శ్రియ సెట్ అయ్యింది. ఆ పాత్రలో ఆమె చాలా బాగా నటించారని దర్శకుడు వివరించాడు.