Begin typing your search above and press return to search.

బాలయ్యతో నాలుగోస్సారి రొమాన్స్

By:  Tupaki Desk   |   14 May 2018 6:28 AM GMT
బాలయ్యతో నాలుగోస్సారి రొమాన్స్
X
ఎన్ని సినిమాలు చేసినా బాలకృష్ణ స్పీడ్ లో మాత్రం తేడా కనిపించే చాన్స్ లేదనిపిస్తోంది. ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా ఈ వయసులో కూడా చాలా ఎనర్జిటిక్ తో సినిమాలు చేస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయడంలో బాలయ్య తరువాతే ఎవరైనా.. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే బాలయ్య వివి.వినాయక్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు.

ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవ రెడ్డి పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. వినాయక్ కి కూడా ఒక మంచి విజయం ఇప్పుడు చాలా అవసరం. ఇకపోతే ఈ కాంబినేషన్ లో సేమ్ హీరోయిన్ నటించడం స్పెషల్ అని చెప్పాలి. ఇక బాలయ్య తో అయితే నాలుగవసరి అవుతుంది. ఏజ్ లెస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియ బాలయ్య తో మరోసారి జత కట్టేందుకు రెడీ అవుతోంది. చెన్నకేశవ రెడ్డి - గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే పైసా వసూల్ సినిమాలో బాలయ్య తో నటించిన శ్రియ నాలుగవసరి కూడా ఓకే చెప్పేసింది.

ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి బాలకృష్ణ సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పైనే తన దృష్టిని ఉంచాడు. ఎలాగైనా ఆ సినిమాను ఒక దారికి తేవాలని ట్రై చేస్తున్నారు. ఆ సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే.