నా వ్యక్తిగత జీవితంను అమ్ముకోను..!

Mon Oct 22 2018 18:39:41 GMT+0530 (IST)

సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా కూడా వారి అభిమానులు మరియు మీడియా జనాలు - ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబర్చుతారు. ఇక వారి పెళ్లి విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సెలబ్రెటీ పెళ్లి చేసుకున్నది ఎవరిని - వారు ఏం చేస్తారు - ఎక్కడ ఉంటారు అనే విషయాల గురించి తెలుసుకునేందుకు ఉత్సుకతను వ్యక్తం చేస్తారు. ఎక్కువ శాతం సెలబ్రెటీలు కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని - విషయాలను - తమ భాగస్వామ్యులను గురించి చెబుతూనే ఉంటారు. ఒకవేళ వారు చెప్పకుండా అవి తెలిసి పోతూనే ఉంటాయి.కాని శ్రియ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. కొన్ని నెలల క్రితం రష్యన్ బిజినెస్ మన్ ను వివాహం చేసుకున్న ఈఅమ్మడు ఇప్పటి వరకు పెళ్లికి సంబంధించిన ఎలాంటి విషయాలను బయటకు చెప్పలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో జరిగిన ఈ వివాహంకు సంబంధించి పెద్దగా ఫొటోలు కూడా బయటకు రాలేదు. తాజాగా ఈమె ‘వీరభోగ వసంత రాయలు’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో మీ వివాహ జీవితం గురించి మీ వారి గురించి చెప్పండి అంటూ యాంకర్ ప్రశ్నించిన సమయంలో ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చిందట. నా వ్యక్తిగత జీవితాన్ని నేను అమ్ముకోవాలని భావించడం లేదు. నా వ్యక్తి గత జీవితం గురించి ఏ ఒక్కరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సినిమాల గురించి ఎలాంటి ప్రశ్నలైనా కూడా అడగండి పర్వాలేదు కాని వ్యక్తిగత జీవితం గురించి అడిగి సమయం వృదా చేయవద్దంటూ శ్రియ సీరియస్ గా చెప్పిందట. వైవాహిక జీవితం గురించి ఈమె ఎందుకు చెప్పేందుకు ఆసక్తి చూడం లేదో తెలియడం లేదని మీడియా వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.