Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్: ఛాంగురే బంగారు రాజా!

By:  Tupaki Desk   |   17 Nov 2018 7:27 PM GMT
ఎన్టీఆర్: ఛాంగురే బంగారు రాజా!
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం లెజెండరీ యాక్టర్ కమ్ పొలిటీషియన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ లో బాలయ్య అచ్చుగుద్దినట్టు సీనియర్ ఎన్టీఆర్ ను దించేశారు. నాన్నగారి పాత్ర పోషించడం ఎలాంటి నటుడికైనా ఎమోషనల్ విషయమే. మరి బాలయ్య కూడా నాన్నగారి పాత్రలో పూర్తిగా లీనమైనట్టున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ కూడా నటిస్తోందట. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో 'దానవీరశూరకర్ణ' కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ లో అదొక మరాపురాని చిత్రం. ఆ సినిమా గురించి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక చిన్న ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ లోనే 'ఛాంగురే బంగారు రాజా' పాట కూడా వస్తుందట. శ్రియ ఈ పాటలోనే తళుక్కున మెరుస్తుందని సమాచారం.

శ్రియ గతంలో బాలయ్య తో 'చెన్నకేశవరెడ్డి'.. 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. 'పైసా వసూల్' సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో క్లాసిక్ చార్ట్ బస్టర్ సాంగ్ తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. మీరు రెడీనే కదా?