Begin typing your search above and press return to search.

ఆనందిస్తూ అందం పంచుతున్న శ్రియ

By:  Tupaki Desk   |   24 March 2017 4:58 PM GMT
ఆనందిస్తూ అందం పంచుతున్న శ్రియ
X
శ్రియా శరణ్ ని ఎవర్ గ్రీన్ బ్యూటీ అనడంలో ఏ మాత్రం తప్పు లేదు. 18 సంవత్సరాలుగా హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేసేస్తోంది ఈ బ్యూటీ. దక్షిణాదితో పాటు నార్త్ లోనూ అడపాదడపా మెరుస్తూనే ఉంటుంది. చేతిలో సినిమాలు లేవనే పరిస్థితి అసలు కనిపించనే కనిపించదు.

ఈ ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో వశిష్టీ దేవిగా తనలోని యాక్టింగ్ ప్లస్ గ్లామర్ ట్యాలెంట్ ఇసుమంతైనా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న శ్రియ.. ఇప్పుడు మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోంది. విహార యాత్రలకు వెళ్లి ఇలా సరదాగా గడపడం ఎంత కామన్ విషయమో.. అక్కడి నుంచి కూడా ఆనందాన్ని అభిమానులకు పంచడం కూడా అంతే కామన్ అయిపోయింది. శ్రియ ఈ విషయంలో మరో అడుగు ముందే ఉంటుంది. ఫుల్లు ట్రాన్స్ పరెంట్ వైట్ టాప్ లో శ్రియ చూపిస్తున్న అందాలు మత్తెక్కించేయడం కామన్. ట్రాన్స్ పరెంట్ అని చెప్పడమే కానీ.. అమ్మడు చూపించని అందం లేదంటే నమ్మాల్సిందే.

ఇక శ్రియ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తమిళ్ లో ఒకటి.. హిందీలో ఒకటి చేసేస్తోంది శ్రియ. శింబు ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న ఏఏఏ చిత్రంలోను.. ప్రకాష్ రూపొందిస్తున్న హిందీ మూవీ తడ్కాలోను నటిస్తోంది శ్రియా శరణ్. ఈ రెండు సినిమాలు 2017లోనే రిలీజ్ కానున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/