ఫోటో బాగుంది కానీ.. టైమింగ్ తేడా

Thu Jan 12 2017 12:21:16 GMT+0530 (IST)

ఏ టైంలో చూసినా మిలమిలలాడే అందం శ్రియా శరణ్ సొంతం. బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో.. మహారాణి వశిష్టీదేవి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రియ. మహరాజునే మాయ చేసే అందం అంటూ పొగిడించేసుకుంది కూడా.

అంతటి అందగత్తె.. మామూలుగా కూడా తెగ ఫోటోలు తీసుకుంటూ.. తన అందాన్ని స్టైలింగ్ ని కలిపి అభిమానులకు పంచుతూ ఉంటుంది. తాజాగా ఈ థర్టీ ప్లస్ అమ్మడు క్రీమ్ కలర్ డిజైనర్ డ్రస్ వేసుకుని అద్దాల ముందు నుంచి స్పెషల్ గా ఓ ఫోటో తీయించుకుంది. అంతే కాదు.. వాట్ ఏ సీన్ అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది కూడా. అమ్మడి మరింత అందంగా కనిపిస్తోంది.. ఇందులో వాట్ ఏ సీన్ అనడంలో ఆంతర్యమే అర్ధం కాని విషయం. అద్దం అవతల ఒక వ్యక్తి వేలాడుతూ అద్దాలు తుడుస్తూ ఉంటాడు. ఇవతల శ్రియ హొయలు పోతూ ఉంటుంది.

ఫోటో తీయించుకునేటపుడు చుట్టుపక్కల పరిసరాలు ఏమున్నాయో.. ఎలా ఉన్నాయో పరిశీలించకుండా పోజులిచ్చేసిందంటే నమ్మలేం. బహుశా..అద్దానికి అవతల ఇవతల అన్న కాన్సెప్ట్ లో వాట్ ఏ సీన్ అని ఉంటుందని అనుకోవచ్చు. అయితే.. అవతల ఓ వ్యక్తి గాల్లో వేలాడుతూ శ్రమిస్తుంటే.. ఇవతల ఫోటోలు తీసుకుంటున్న టైమింగ్ బాగోలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/