Begin typing your search above and press return to search.

పాపం వశిష్ఠి.. శాతకర్ణి తర్వాతేమిటి?

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:42 PM GMT
పాపం వశిష్ఠి.. శాతకర్ణి తర్వాతేమిటి?
X
"ఇష్టం" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ శ్రేయ. నాటినుంచి మొదలైన ఆమె కెరీర్లో నేటి "గౌతమీపుత్ర శాతకర్ణి" కచ్చితంగా ఒక మైలురాయనే అనుకోవాలి. వశిష్ఠి పాత్రకు పూర్తిస్థాయిలో ఫిట్ కావడమే కాకుండా, పూర్తిగా న్యాయం చేసిందని.. కెరీర్ తొలినాళ్లకంటే అందంగా ఉందని తెగ పొగడ్తల వర్షాలు కురిసాశాయి శ్రీయపై. శాతకర్ణి విజయం గురించి మాట్లాడుకునే వారంతా బాలయ్య, క్రిష్ ల అనంతరం శ్రీయ గురించి మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో... శాతకర్ణి సినిమా అనంతరం శ్రీయ సుడి మామూలుగా ఉండదని, వరుస ఆఫర్లతో ఆమె డైరీ నిండిపోతుందని అంతా భావించిన సంగతి తెలిసిందే. కానీ... సినీజనాలతో పాటు శ్రీయ కూడా భావించినట్లుగా శాతకర్ణి అనంతరం అలా జరగడం లేదని అంటున్నారు.

అవును... "గౌతమీపుత్ర శాతకర్ణి"లో వశిష్టి గా మెప్పించిన శ్రీయకు ఆ సినిమా సక్సెస్ సాధించిన అనంతరం వరుస ఆఫర్లు వస్తాయని అంతా భావించిన మాట వాస్తవమే. అయితే... అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదని అంటున్నారు. దీంతో ఆమె తెగ బాదపడిపోతుందని చెబుతున్నారు. బాలయ్య 101 మూవీలో ఛాన్స్ ను మాత్రం కన్ఫం చేసుకున్న శ్రీయకు.. అది తప్ప మరే ఆఫరూ ఇప్పటివరకూ రాలేదట. సాదారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ కి ఆఫర్లు వెల్లువలా వస్తాయని అంటారు.. ఇది చాలా మంది విషయంలో వాస్తవం కూడా! కానీ... ఎందుకో శ్రేయ విషయంలో అలా జరగడం లేదు... పాపం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/