కొత్తందం మెరిసింది.. మిస్ ఇండియా 2019 ఎవరంటే?

Sun Jun 16 2019 17:57:27 GMT+0530 (IST)

క్యాలండర్ లో ఏడాది మారినంతనే కొత్త వారికి అవకాశాలు లభిస్తుంటాయి. ప్రతి ఏటా నిర్వహించే మిస్ ఇండియా పోటీలు తాజాగా ముగిశాయి. ఈ ఏడాది థాయిలాండ్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు మరెవరో కాదు.. మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకున్న వారు.తాజాగా మిస్ ఇండియా కిరీటం రాజస్థాన్ కు చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతమైంది. రన్నరప్ గా ఛత్తీస్ గఢ్ కు చెందిన శివానీ జాదవ్.. సెకండ్ రన్నరప్ గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బిహార్ కు చెందిన శ్రేయా శంకర్ సొంతం చేసుకున్నారు.

ముంబయిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత ఏడాది సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఏపీకి చెందిన శ్రేయారావు కామవరపు.. తాజా విజేతకు తన కిరీటాన్ని సంజానా విజ్ కు బహుకరించారు. ఏదైనా లక్ష్యాన్ని అనుకొని.. దాన్ని సాధించటానికి శరీరంలోని అణువణువూ మనకు సహకరిస్తూ విజయం వైపు అడుగులు వేయటానికి దోహదడపతుందని వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా.. నటీనటులు హిమా ఖురేషీ.. చిత్రంగధసింగ్.. తదితర ప్రముఖులు హాజరయ్యారు.