ఆ 'పిల్ ఏ' హాట్ టాపిక్ అయిపోయింది

Sun Mar 19 2017 12:55:17 GMT+0530 (IST)

ప్రేమ ఇష్క్ కాదల్.. సావిత్రి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేని. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో తీస్తున్న ఈ వెబ్ సిరీస్ పేరు.. 'పిల్ ఏ'. ఇంగ్లీష్ పిల్ల టైటిల్ ను వేసి.. దాన్ని కొంచె మార్చి పిల్ ఏ చేసిన తీరు బాగుంది.

ఇప్పుడీ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. జీవితంలో మర్చిపోలేని క్షణాలుంటాయ్ అంటూ రొమాంటిక్ మూమెంట్స్ ను.. కంట్రోల్ చేసుకోలేని క్షణాలు అంటూ పార్టీలో ఎంజాయ్ చేసిన సీన్స్ ను చూపించాడు దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పేరు ధన్యనే కావడం విశేషం. అయితే.. అనుకోకుండా హీరోయిన్ పాత్ర గర్భవతి అవుతుంది. ఇందుకు కారణం అయిన వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడం చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది.

ఈ ట్రైలర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ధన్య బాలకృష్ణ యాక్టింగ్ గురించే. చివర్లో 'ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా.. తల దించుకుంటావేంట్రా' అంటూ ఎదుటి వ్యక్తిని కొడుతూనే చేసిన సన్నివేశం చూస్తే.. ఈమె ఎంత మంచి యాక్టర్ అనే విషయం అర్ధమవుతుంది.

ఇది వెబ్ సిరీస్ అయినా.. సిల్వర్ స్క్రీన్ పై మెరిసే ఫీచర్ ఫిలింకి ఏ మాత్ర తగ్గకుండా తీశాడు దర్శకుడు పవన్ సాదినేని. ఫ్రేమింగ్.. విజువల్స్.. లొకేషన్స్.. డైలాగ్స్.. ఇలా ఏ విషయంలో దర్శకుడు రాజీ పడలేదు. సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలిగితే అందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఈ పిల్ ఏ ట్రైలర్ చూస్తేనే.. పవన్ సాదినేని దీన్ని ఎంత ఇష్టపడి తీశాడో అర్ధమవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి కావడంతో.. విజువల్ రిచ్ నెస్ కూడా ఉంది. మొత్తం మీద వెబ్ సిరీస్ ట్రైలర్ ని ఈ రేంజ్ లో కట్ చేసి.. పవన్ సాదినేని మళ్లీ హాట్ టాపిక్ అయిపోయాడు.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/