శ్రద్ధగా తినిపిస్తున్న ప్రభాస్!!

Wed Sep 13 2017 18:23:38 GMT+0530 (IST)

బాహుబలి సిరీస్ ముగింపునకు ముందే ప్రభాస్ తన కొత్త  సినిమా స్టార్ట్ చేశాడు. రన్ రాజా రన్ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నాడు ప్రభాస్. అయితే.. బాహుబలి ఫిజిక్ నుంచి తనను తాను మార్చుకునేందుకు కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న ప్రభాస్.. నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేసుకోవడంలో కూడా మరికొంత ఆలస్యం చేశాడు.అయితే.. ఎట్టకేలకు సాహో షూటింగ్ ను స్టార్ట్ చేసేసిన  యంగ్ రెబల్ స్టార్.. ఇప్పటికే హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో కీలక సన్నివేశాల్లో కూడా నటించేస్తున్నాడు. శ్రద్ధా కపూర్ కు హైద్రాబాదీ రుచులు టేస్ట్ చూపించడంలో ప్రత్యేక శ్రద్ధ  చూపిస్తున్నాడట మన బాహుబలి. నోరూరించే హైద్రాబాద్ వంటకాలతో ఈ మధ్య స్పెషల్  గా ట్రీట్ ఇచ్చాడట కూడా. అయితే.. ఇది కేవలం శ్రద్ధాకు మాత్రమే కాదులెండి. సాహో టీంలో మరికొందరితో కలిపి ఓ 17-18 రకాల టేస్టీ ఫుడ్స్ తో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్ కి శ్రద్ధ ఫ్లాట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

అసలు నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని ఒప్పేసుకుని ఫుడ్ లాగించేసిందట శ్రద్ధా కపూర్. ఇలాంటి అద్భుతమైన వంటకాలను ఏరి కోరి ఎంపిక చేసి మరీ అందించినందుకు స్పెషల్ గా కృతజ్ఞతలు కూడా చెప్పిందట. మొత్తానికి హీరోయిన్ ఆఫర్ ఇవ్వడమే కాదు.. తనకు నచ్చిన ఫుడ్ ని తన హీరోయిన్ తో స్పెషల్ గా తినిపించేస్తున్నాడు ప్రభాస్.