Begin typing your search above and press return to search.

అది ప్రాంకా? అంత సీన్ లేదు బేబీ

By:  Tupaki Desk   |   28 May 2018 6:06 AM GMT
అది ప్రాంకా? అంత సీన్ లేదు బేబీ
X
కొంత మంది అమ్మాయిలు ఈ రోజుల్లో ప్రవర్తిస్తోన్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఇక మరికొంత మంది క్యాష్ పార్టీ భామల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నడి రోడ్డు మీదే చిందులు వేస్తూ ఆటపాటిస్తుంటారు. పోలీసులు వచ్చినా కూడా లేక చేయరు. కంట్రోల్ చేద్దామంటే లేడీస్. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా శ్రద్దా దాస్ రోడ్డు మీద ఓ ప్రాంక్ చేసిన విధానం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆమె ప్రాంక్ అని చెప్పినా కూడా నెటిజన్స్ మాత్రం బొందలా ఉందని కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా నైట్ లో బయటకు వెళ్లిన శ్రద్ధ రోడ్డు పక్కన ఉన్న ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఎవరు ఊహించని పని చేసింది. అతను నిలబడి ఉండగా ముందుకు వెళ్లి చెంపలను పట్టి గిల్లేసి ఊపేసింది. ఆ వెంటనే వెనక్కి తిరిగి నవ్వుతూ పరిగెత్తింది. ఇక అంతటితో ఆగకుండా ఆ సిన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదేదో పెద్ద ప్రాంక్ అన్నట్లు నానా హంగామా చేస్తోంది అమ్మడు. కాని అక్కడ అంత సీన్ లేదనే చెప్పాలి. ప్రాంక్ అంటే అవతలివారు స్టన్ అవ్వాలి లేదా షాకవ్వాలి. ఇక్కడ రెండూ జరగలేదు.

ఇలా నవ్వులాట కోసం ఓ పెద్దాయనపై ఫ్రాంక్ అని చెప్పి అల్లరి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రద్దా ఇది ఒక ప్రాంక్ అని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఆటో వాలాని తరువాత కలిసి మాట్లాడానని వివరించింది. అయితే ఆ వీడియో కూడా పెట్టకపోయావా అని మరికొంత మంది కామెంట్ చేశారు. ప్రస్తుతం శ్రద్దాకు ఆఫర్స్ ఏమి లేవు. చివరగా గరుడవేగ సినిమాలో కనిపించింది.