Begin typing your search above and press return to search.

యూ-టర్న్ భామకి మరో టర్నింగ్

By:  Tupaki Desk   |   23 May 2017 6:44 AM GMT
యూ-టర్న్ భామకి మరో టర్నింగ్
X
ఎప్పుడు ఎక్కడ కెరీర్ కి టర్నింగ్ దొరుకుతుందో చెప్పడం చాలా కష్టం. కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ కి అత్తారింటికి దారేది చిత్రం ఏ స్థాయి ఇమేజ్ తెచ్చిందో చూశాం. ఇప్పుడు మరో కన్నడ బ్యూటీకి స్వాగతం పలుకుతోంది టాలీవుడ్. యూ-టర్న్ చిత్రంతో శాండల్ వుడ్ ని అలరించిన శ్రద్ధా శ్రీనాథ్ అక్కడ మంచి అవకాశాలే చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వరుసగా ఈమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుతున్నాయి.

గ్లామర్ కు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వని శ్రద్ధా శ్రీనాథ్ పెర్ఫామెన్స్ రోల్స్ కు మాత్రం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే క్షణం ఫేమ్ రవికాంత్ పెరెపు దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాకి ఈమె సైన్ చేయగా.. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించనుంది. ఇప్పుడు మరో అవకాశం ఈ భామ తలుపుతట్టింది. విశ్వనాథ్ అరిగెల డైరెక్షన్ లో రూపొందనున్న రొమాంటిక్ కామెడీ మూవీకి శ్రద్ధా శ్రీనాథ్ సై అన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆదికి జోడీగా నటించనుంది ఈ భామ.

వరుసగా టాలీవుడ్ నుంచి అవకాశాలు అందుకుంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. ఎంపిక విషయంలో మాత్రం చాలా ఎలర్ట్ గా ఉన్నానని చెబుతోంది. ఒకవైపు కన్నడ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తూనే.. మరోవైపు ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటాలన్నది ఈ బ్యూటీ ఐడియా. ట్యాలెంట్ విషయంలో కొదువ లేకపోవడంతో.. శ్రద్ధాకి ఈ టార్గెట్ పెద్ద కష్టం కాకపోవచ్చు.