ఫోటో స్టొరీ: డెస్టినేషన్ గ్లామర్ రోల్స్!

Thu Apr 25 2019 23:00:01 GMT+0530 (IST)

ఈ గ్లామర్ ఇండస్ట్రీ తీరే అంత. అవకాశాలు తెచ్చుకోవడమే కష్టం అనుకుంటే అవకాశాలు వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం.  హీరోయిన్ల విషయమే తీసుకుంటే సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఎంతో జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటేనే కానీ లాంగ్ టర్మ్ హీరోయిన్ గా కొనసాగలేరు.  కానీ ఈ విషయాన్ని బెంగుళూరు భామ శ్రద్ధా శ్రీనాథ్ అప్పుడే అర్థం చేసుకున్నట్టుగా ఉంది.న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'జెర్సీ' తో శ్రద్ధ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రద్ధకు ఇది టాలీవుడ్ లో మొదటి సినిమానే కానీ హీరోయిన్ గా కాదు. ఇప్పటికే కన్నడలోనూ.. తమిళంలోనూ నటించింది. ఇప్పుడు తెలుగులో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.  నటన విషయంలో ఫుల్ మార్క్స్ తెచ్చుకుంది. కాకపోతే ఇప్పుడు ఒకటే చిక్కు.  ఇలా గ్లామర్ కు ప్రాధాన్యం లేకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తే మన ఫిలిం మేకర్లు ఇకపై అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్రద్ధ కూడా ఈ విషయాన్ని వెంటనే గ్రహించినట్టుంది. అందుకే  వెంటనే హాట్ ఫోటో షూట్లు స్టార్ట్ చేసింది.  

ఆమె హాట్ ఫోటో షూట్ల మెసేజ్ సింపుల్..  "నేను గ్లామర్ రోల్స్ కు రెడీ.. నన్ను మహానటిగా భావించి గ్లామర్ పాత్రలు ఇవ్వడం మానకండి." మరి ఈ మెసేజ్ ఇప్పటికే అర్థం కావాల్సిన వారికి చక్కగా అర్థం అయి ఉంటుంది లెండి.