వాళ్ళిద్దరి కథలో ఆమె సెట్ అయ్యిందట

Wed Feb 14 2018 21:00:01 GMT+0530 (IST)

ప్రస్తుతం కామెడీ అండ్ ఎమోషనల్  ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగా నాని - నాగ్ మల్టి స్టారర్ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఇంకా షూటింగ్ కూడా స్టార్ కానీ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25న లాంచింగ్ కార్యక్రమాలను నిర్వహించి. మార్చ్ మొదటి వారలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు.అయితే ఇంకా నటీనటుల విషయంలో మాత్రం యూనిట్  ఫైనల్ నిర్ణయానికి రాలేకపోతోంది. ముఖ్యంగా కథానాయిక విషయంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చాలా ఆలోచిస్తున్నాడట. మల్టి స్టారర్ కథ కావడంతో ఇద్దరి హీరోయిన్స్ సమానంగా ఉండాలి. ముఖ్యంగా నాగార్జున రేంజ్ కు సరిపోయేలా ఉండే హీరోయిన్ కోసం రీసెర్చ్ లు బాగానే చేస్తున్నారట. అయితే నాని కి మాత్రం ఆల్ మోస్ట్ ఒక హీరోయిన్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. శాండిల్ వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ అనే హీరోయిన్ ని దర్శకనిర్మాతలు ఫైనల్ చేసినట్లు టాక్.

మణిరత్నం - చెలియా సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో కనిపించిన శ్రద్దా యూ టర్న్ అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించింది. ఆ సినిమాను తెలుగులో సమంత రీమేక్ చేయాలనీ అనుకుంటోంది. ఇకపోతే ఆమెను ఫైనల్ చేస్తారా లేదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. ఎంతకైనా మంచిదని దర్శకుడు మరో ఇద్దరి హీరోయిన్స్ ని కూడా లైన్ లో పెట్టుకున్నట్లు సమాచారం. ఒక వేళ శ్రద్దా కి ఈ అఫర్ దక్కితే అమ్మడు సౌత్ లో మెరవడం పక్కా.