ఇంకెప్పుడు నేర్చుకుంటావ్ శ్రద్దా?

Tue Oct 24 2017 11:30:01 GMT+0530 (IST)

బాలీవుడ్ లో ప్రేమ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరోయిన్స్ లలో శ్రద్దా కపూర్ ఒకరు. అమ్మడు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎదో ఒక క్యారెక్టర్ చాలా వరకు హైలెట్ అయ్యింది. పాత్రలు నచ్చితే తప్పా శ్రద్ధ సినిమా ఒకే చెయ్యదని ఒక టాక్ ఉంది. అలాగే తనకు నచ్చితే ప్రాణం పెట్టి నటిస్తుందని కూడా మరికొందరు అంటుంటారు. అయితే అమ్మడు ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే సైనా నెహ్వాల్ బాయోపిక్ లో కూడా నటించడానికి రెడీ అయ్యింది.సాహో సినిమా సంగతి పక్కనబెడితే.. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించేందుకు ప్రిపేర్ అవుతోంది ఈ హీరోయిన్. అంతే కాకుండా స్పెషల్ గా బ్యాడ్మింటన్ ఆటను నేర్చుకుంటోంది. అందుకోసం తన రెగ్యులర్ టైమ్ టేబుల్ ను కూడా మార్చేసుకుందట. ప్రస్తుతం రోజు ఉదయానే 6 గంటలకు స్పెషల్ క్లాసెస్ కి వెళుతోందట. ఇప్పటివరకు 34 క్లాసులను పూర్తి చేసిందట. స్పెషల్ గా పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో శిక్షణను కూడా తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇక సైన నెహ్వాల్ ని కూడా తరచు కలుస్తూ.. తన హావభావాలను చక్కగా అలవాటు చేసుకుంటుందట.

అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ ని స్టార్ట్ చెయ్యాలి. కానీ శ్రద్దా ఇంకా బ్యాడ్మింటన్ ఆటను పూర్తిగా అలవాటు చేసుకోలేకపోవడం తో దర్శక నిర్మాతలు కాస్త వెయిట్ చెయ్యాలని అనుకుంటున్నారట. పూర్తిగా సెట్ అయిన తర్వాతనే సైనా బయోపిక్ ని సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి శ్రద్దా ఇంకెప్పుడు రెడీ అవుతుందో చూడాలి.