Begin typing your search above and press return to search.

సెక్సీ హీరోయిన్ కు పేరెంట్స్ వార్నింగ్

By:  Tupaki Desk   |   27 Sep 2016 10:30 PM GMT
సెక్సీ హీరోయిన్ కు పేరెంట్స్ వార్నింగ్
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇప్పుడు సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు చేస్తుండడంతో.. షెడ్యూల్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఉండడంతో.. ఇంట్లో ఉండే తీరిక కూడా ఉండడం లేదని తెలుస్తోంది. వీటికి తోడు అమ్మడికి ఈ మధ్య బైట చక్కర్లు కూడా ఎక్కువైపోయాయట.

నిజానికి ఓ నెలరోజులకు పైగా శ్రద్ధ ఇండియాలోనే లేదు. హాఫ్ గాళ్ ఫ్రెండ్ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లొచ్చిన ఈ భామ.. రీసెంట్ గానే ముంబై చేరుకుంది. ఇక్కడికి వచ్చాక కూడా.. ఈ అమ్మడి షెడ్యూల్స్ టైట్ గానే ఉన్నాయి. కానీ అవన్నీ సాయంత్రానికే అయిపోయేవే. అయినా సరే శ్రద్ధ మాత్రం ఇంటికి చేరుకోవడానికి బాగా లేట్ అవుతోందని తెలుస్తోంది. ఈవెనింగ్ తన షూటింగ్ ప్యాకప్ అయిపోగానే.. తన గాళ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ను వేసుకుని ఈ అమ్మడు ఊరంతా చక్కర్లు కొట్టేస్తోందట.

ఒకట్రెండు రోజులంటే ఓకే కానీ.. ప్రతీ రోజూ ఇదే తంతు నడుస్తుండడంతో.. శ్రద్ధా కపూర్ తల్లిదండ్రులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇంట్లో గడిపే సమయం పెంచాలంటూ ఆమె తండ్రి శక్తి కపూర్ గట్టి వార్నింగ్ నే ఇవ్వగా.. తల్లి శివంగి కూడా ఇదే టైపులో హెచ్చరించిందని అంటున్నారు. ఇంటిపై శ్రద్ధ పెట్టాలని శ్రద్ధాకపూర్ కి గట్టి వార్నింగే పడ్డట్టు సన్నిహితులు కూడా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/