సాహో భామకు కళ్యాణఘడియలు!

Wed Mar 20 2019 11:52:52 GMT+0530 (IST)

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇప్పుడు హిందీ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న పేరే. ప్రభాస్ నూతన చిత్రం 'సాహో' లో హీరోయిన్ గా నటిస్తుండడంతో  శ్రద్ధకు తెలుగు ఆడియన్స్ లో భారీ గుర్తింపే వచ్చింది. 'సాహో' విడుదల అయిన తర్వాత శ్రద్ధ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధ పెళ్ళి గురించి బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.శ్రద్ధ చాలా రోజుల నుండి తన చిన్ననాటి స్నేహితుడు.. ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉందని వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. తమ ప్రేమ విషయాన్ని ఈ జంట చాలా రోజులు ఒప్పుకోకుండా మెయిన్టెయిన్ చేశారు కానీ నవంబర్ లో జరిగిన రణవీర్ సింగ్ - దీపిక పదుకొనే డెస్టినేషన్ వెడ్డింగ్ లో మాత్రం బయటపడిపోయారట. ఇదిలా ఉంటే రీసెంట్ గా రోహన్ తన కుటుంబ సభ్యులతో పెళ్ళి విషయం మాట్లాడి ఒప్పించాడట.  తన ఇంట్లో వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోహన్ - శ్రద్ధా కపూర్ వివాహానికి అడ్డంకులు ఇక ఏవీ లేవని.. వచ్చే ఏడాది ఈ లవ్ జంట ఒక్కటౌతారని సమాచారం.  ఈ ఏడాది చివర్లో నిశ్చితార్థం జరుగుతుందట.

శ్రద్ధ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'సాహో' తో పాటుగా 'చిచోరే'.. 'స్ట్రీట్ డ్యాన్సర్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.  సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించాల్సి ఉంది కానీ రీసెంట్ గా ఆ ప్రాజెక్టునుండి బయటకు వచ్చేసింది.