Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ కు నో చెప్పిన బ్యూటీ ?

By:  Tupaki Desk   |   22 April 2019 8:05 AM GMT
ఆర్ ఆర్ ఆర్ కు నో చెప్పిన బ్యూటీ ?
X
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కు హీరోయిన్ చిక్కులు ఇంకా వీడటం లేదు. ఒకపక్క రామ్ చరణ్ గాయంతో షూటింగ్ కు మూడు వారాలు బ్రేక్ పడటం ఒక ఎత్తైతే తారక్ కోసం ఎంచుకున్న డైసి ఎడ్గార్ జోన్స్ తప్పుకోవడం ఇంకో చిక్కును తెచ్చిపెట్టింది. గత కొద్దిరోజులుగా ఈ పాత్ర కోసం జక్కన్న సాహో ఫేమ్ శ్రద్ధ కపూర్ తో పాటు పరిణితి చోప్రా కోసం ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

నిజంగా రాజమౌళి వీళ్ళను కలిశాడో లేదో తెలియదు కానీ అప్పుడే శ్రద్ధ నో చెప్పినట్టుగా ప్రచారం స్టార్ట్ అయిపోయింది. వరుసగా ఉన్న ప్రాజెక్ట్స్ వల్ల శ్రద్ధా కపూర్ నో చెప్పిందని అందులోనూ సాహు ఆలస్యాన్ని కళ్లారా చూసి టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ డిలే అవుతాయన్న అభిప్రాయం తనలో బలంగా ఉండటం వల్లే నో చెప్పిందని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి

ఇది రాజమౌళి స్వయంగా ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు. నిజానికి శ్రద్ధా కపూర్ అలియా భట్ అంత బిజీగా కూడా లేదు. సాహో ఎలాగూ ఫినిషింగ్ స్టేజి లో ఉంది. తన భాగం దాదాపు పూర్తయినట్టే. ఇది కాకుండా బాలీవుడ్ మూవీస్ చిచొరేతో పాటు స్ట్రీట్ డాన్సర్ అనే మూవీ మాత్రమే శ్రద్ధ కమిట్ అయ్యింది.

నిజంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం అడిగి ఉంటే డేట్స్ ఇవ్వడం మరీ అసాధ్యం అయితే కాదు. అయితే జక్కన్న నిజంగా ఆఫర్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. పూణే షెడ్యూల్ మొదలుపెట్టే లోపు ఈ అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని రాజమౌళి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు వినికిడి