షార్ట్ జీన్స్ లో సాహో సుందరి

Tue Sep 12 2017 17:04:45 GMT+0530 (IST)

సాధారణంగా చాలామంది హీరోయిన్స్ సౌత్ నుండి నార్త్ కు వెళ్లి అక్కడ బాలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకుంటారు. ఆ తర్వాత ఒక్క హిట్ పడి రెమ్యూనరేషన్ పెరగడంతో తారలు మళ్లీ మ్యాజిక్ జరిగితే గాని సౌత్ లో అడుగుపెట్టారు. కానీ నార్త్ నుంచి సౌత్ లోకి వచ్చే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. సినిమా హిట్ అయినా కాకపోయినా వారికి పోయేదేమీ ఉండదు వారికి వచ్చే రెమ్యూనరేషన్ వారికి వస్తుంది. కానీ ఇక్కడ ప్రేక్షకులకు నచ్చుతామా లేదా అని మంచి ఛాన్స్ వస్తే సినిమాలకు రెడీ అయిపోతారు.ఇప్పుడు అదే ఆలోచనతో రాబోతోంది శ్రద్దా కపూర్. బాహుబలి లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్ తో నటించడానికి ఎవరు అడ్డుచెప్పారు.  కానీ శ్రద్దా మొదట్లో సాహో లో నటించడానికి  కాస్త శ్రద్ధ చూపలేదని ఓ టాక్ ఉంది. కానీ ఫైనల్ గా హీరోయిన్ గా సెట్ అవ్వడంతో ఆమెకు సౌత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడికి తెలుగు -తమిళ్ జనాల ఫాలోవర్స్ ని పెంచేసుకుంది. మంచి ఆదరణ వస్తుండడంతో సాహో సినిమా కోసం తెలుగు కాస్త నేర్చుకోవడం అలవాటు చేసుకుంటుందట. ప్రభాస్ కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. మొదటి సారి అమ్మడు ఒక తెలుగు -హిందీ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో శ్రద్దా ఈ మధ్య చురుగా పాల్గొంటోంది.

ఏ విషయాన్నీ అయినా అభిమానులతో పంచుకుంటోంది. ఇక సాహో గురించి న్యూస్ కూడా ఎప్పటికపుడు బాలీవుడ్ జనాలకు తెలిసేలా చేస్తోంది. అయితే అమ్మడు రీసెంట్ పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది ప్రముఖ వోగ్ ఐ వేర్స్ తో కనిపించింది. బ్లాక్ జాకెట్ మరియి షార్ట్ టోర్న్ జీన్స్ లో స్టైలిష్ గా కనిపిస్తోంది. అలాగే తను లీడ్ రోల్ లో నటించిన హసీనా పార్కర్ అనే చిత్రం మరో పదిరోజుల్లో రాబోతోందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అపూర్వా లిఖియా దర్శకత్వం వహించిన ఆ చిత్రం బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రానుంది.