టైగర్ కోసం సాహో హీరోయిన్

Tue Feb 12 2019 13:57:33 GMT+0530 (IST)

డార్లింగ్ ప్రభాస్ సాహోతో టాలీవుడ్ కు పరిచామవుతున్న శ్రద్ధా కపూర్ మనవాళ్లకు కొత్తే కానీ రెగ్యులర్ గా హిందీ సినిమాలు చూసే అలవాటున్న వాళ్లకు తను ఎంత టాలెంటెడ్ యాక్టరో బాగా తెలుసు. దర్శకుడు సుజిత్ ఏరికోరి తననే తీసుకోవడానికి కారణం కూడా అదే. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధా తాజాగా మరో ప్రాజెక్ట్ సైన్ చేసింది. అదే భాగీ 3. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా శ్రద్ధనే ఉంటుందని యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.టైగర్ కు కమర్షియల్ గా బాగా వర్క్ అవుట్ అయిన సినిమా భాగీనే. ప్రభాస్ వర్షం ఛాయల్లో రూపొందిన ఆ మూవీలో మన సుధీర్ బాబు విలన్ గా చేసాడు. వసూళ్ల పరంగా పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత భాగీ 2ని అడవి శేష్ క్షణంకి  ఇష్టం వచ్చిన మసాలాలు జోడించి రీమేక్ చేసుకున్నారు. అదీ సక్సెస్ అయ్యింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు భాగీ 3 ని రెడీ చేస్తున్నారు. భాగీ ఫస్ట్ పార్ట్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో శ్రద్ధా కపూర్ టైగర్ తో కలిసి నటిస్తోంది. మధ్యలో వచ్చిన భాగీ 2లో దిశా పటాని హీరోయిన్ గా చేసింది.

ఇప్పుడు మళ్ళి శ్రద్ధా కపూర్ కె ఛాన్స్ దక్కింది.నిజానికి ఈ భాగీ సిరీస్ ఎంత సక్సెస్ అయినా తన ఇమేజ్ కి మించిన హీరోయిజం చూపిస్తున్న టైగర్ ష్రాఫ్ మీద సోషల్ మీడియాలో ట్రాలింగ్ జరుగుతూ ఉంటుంది. అయినా మనోడు కేర్ చేయడు లెండి. భాగీ 3కి ఖాన్ అహ్మద్ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ సారి ఏ తెలుగు సినిమాను తీసుకుంటారో ప్రస్తుతానికి సస్పెన్స్. భాగీ 2 కూడా క్షణం రీమేక్ అని ట్రైలర్ వచ్చాకే తెలిసింది. ఇది కూడా అంతే. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.