సాహో కోసం ఆమె డేట్లే లేటు

Sat Aug 12 2017 12:53:00 GMT+0530 (IST)

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏ రేంజ్ లో ఫెమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత దేశంలో ఉన్న ప్రతి మీడియా ఇతగాడు తీయబోయే నెక్స్ట్ సినిమా గురించి ఏ న్యూస్ దొరుకుతుందా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా అయితే ఇప్పుడు టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. ప్రభాస్ సాహో సినిమా గురించి ఎలాని న్యూస్ దొరికినా ఆ విషయంపై అనేక కథనాలను ప్రసారం చేస్తోంది.

అయితే సాహో సినిమా షూటింగ్ స్టార్ట్  అయ్యి నెలలు గడుస్తున్నా ఇంకా ప్రభాస్ సరసన కథా నాయికను సెట్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఈ మధ్య ఓ హీరయిన్ తో సంప్రదింపులు జరిపారని టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ కి కథ వినిపించినట్టు సినీ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక కాస్త సతమత మవుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ చాలా వరకు పెరిగిపోయింది. సాహో సినిమా కోసం యూవీ క్రియేషన్స్ 150 కోట్లను ఖర్చు చేస్తున్నా సంగతి కూడా తెలిసిందే. అయితే అలాంటి సినిమాలో నటించడం కోసం ఏ హీరోయిన్ అయినా తప్పకుండా ఒప్పుకుంటుంది. మరి శ్రద్దా కపూర్ సాహో సినిమాలో మెరుస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే ఇప్పటికే ప్రభాస్ సాహో సినిమాను ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడని సినిమాటోగ్రాఫర్ మది చెప్పేశాడు. మరి ఇంత వరకు హీరయిన్ పై ఓ నిర్దారణకు రాని సినిమా యూనిట్ ఎలా ముందుకు వెళుతుందో అని కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాను "రన్ రాజా రన్" చిత్ర దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.