సాలె గూడులో పంచదార చిలక

Fri Nov 09 2018 21:23:31 GMT+0530 (IST)

సాలీడు అల్లిన గూడులో చిక్కుకుపోయిందీ పంచదార చిలక. అందమైన ఆ గూడు తనని విడిచిపెట్టే ప్రసక్తే లేదంంటోంది. అంత పెర్ ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది ఈ డ్రెస్. ప్రత్యేకించి శ్రద్ధా కోసమే డిజైన్ చేయించారా? అన్నట్టు పొందిగ్గా కుదిరింది. పిక్కలపైకి తేలిన ప్రత్యేకమైన డిజైనర్ పరికిణీలో శ్రద్ధా విరుపులు యూత్‌ని మత్తులోకి దించేస్తున్నాయి. అసలే నేచురల్ బ్యూటీ .. ఆపై ఒళ్లు అలా ఒళ్లు విరుచుకుంటే ఇంకేమైనా ఉందా.. ? ఆ అరుదైన  ఛాయా చిత్రం ఓ మైమరుపు.అందాల కథానాయిక శ్రద్ధా కపూర్ గత కొంతకాలంగా క్షణం తీరిక లేకండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. ఇటీవలే శ్రద్ధా నటించిన స్త్రీ - బట్టి గుల్ మీటర్ చాలు చిత్రాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్నాయి. ఆ సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నప్పుడు.. అటువైపు పరుగులు పెడుతూనే మరోవైపు సాహో చిత్రంలో నటించింది. ఇప్పుడు `సాహో` చిత్రంలో నటిస్తూనే - మరోవైపు బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రీకరణలో పాల్గొంటోంది.

కెరీర్ పరంగా క్షణం తీరిక అన్నదే లేదు. ముఖ్యంగా `సాహో` చిత్రం కోసం భారీగా కాల్ షీట్లు కేటాయించి ఈ సినిమాలో యాక్షన్ క్వీన్ గా నటిస్తూ ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. శ్రద్ధా నటిస్తున్న ఇంటర్నేషనల్ స్టాండార్డ్ మూవీగా ఇప్పటికే `సాహో` పేరు మార్మోగిపోతోంది. ఇదివరకూ రిలీజ్ చేసిన మేకింగ్ విజువల్స్‌తో ఈ సినిమా స్థాయిపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. శ్రద్ధా కెరీర్ సాహో తర్వాత సాహో ముందు అన్న చందంగా మాట్లాడుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లోనూ `చిచోర్` అనే చిత్రంలో నటిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాజిద్ నడియావాలా నిర్మాత. 2019 ఆగస్టులో రిలీజ్ కానుంది.