Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సాహో అనిపిస్తున్న అందాలు

By:  Tupaki Desk   |   19 Sep 2018 10:22 AM GMT
ఫోటో స్టొరీ: సాహో అనిపిస్తున్న అందాలు
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. తన తాజా హిందీ చిత్రం 'స్త్రీ' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో తన నెక్స్ట్ సినిమాలపై మరింత శ్రద్ధతో పనిచేస్తోంది. ఇక షూటింగ్ లు ఎప్పుడూ ఉండేవే గానీ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ లో పాల్గొంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ గా అలానే రెడ్ కలర్ డ్రెస్ లో వేసుకొని ఒక ఫోటోషూట్ లో పాల్గొంది. ఇది కరెక్ట్ గా చెప్తే ఫోటో షూట్ కాదు. ఎందుకంటే 'స్త్రీ' సినిమా సక్సెస్ పార్టీ కి ఇలా తయారయ్యి వచ్చి అక్కడి జనాల మతి పోగొట్టింది. క్లీవేజ్ షో అని మరోటని పెద్దగా అందాలవిందు చేయలేదుగానీ రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ మోడల్ లాగా కనిపించింది. సూదంటురాయి చూపులతో చంపేస్తోంది. ఇక ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మూడు గంటల్లోపే 5.9 లక్షల లైకులు వచ్చాయి. మరేమనుకున్నారు? ఇన్స్టా లో 23. 6 మిలియన్ ఫాలోయర్ల సైన్యం ఉంది శ్రద్ధాకు!

ఇక శ్రద్ధ తెలుగు చిత్రసీమకు ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ద్వారా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయితే తెలుగు వారికీ కూడా శ్రద్ద ఫేవరిట్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయమే.