Begin typing your search above and press return to search.

సాహో అనిపిస్తున్న శ్రద్ధ క్యాజువల్ లుక్

By:  Tupaki Desk   |   15 Sep 2019 10:52 AM GMT
సాహో అనిపిస్తున్న శ్రద్ధ క్యాజువల్ లుక్
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇప్పుడు 'సాహో' తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. 'సాహో' రిలీజ్ అయిన వారం రోజులకు శ్రద్ధ నటించిన మరో చిత్రం 'చిచోరే' కూడా విడుదలైంది. దీంతో రెండు మూడు వారాలుగా శ్రద్ధ ప్రమోషన్స్ తో గడపాల్సి వచ్చింది. బిజీ బిజీ ప్రమోషన్స్ తర్వాత శ్రద్ధకు కాస్త ఫ్రీ టైమ్ చిక్కడంతో తన ఫ్రెండ్స్ తో గడిపేందుకు రెడీ అయింది.

ముంబైలో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అలా కదిలితే చాలు.. ఫోటోలు తీసేస్తారు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తారు. శ్రద్ధ కూడా టాప్ హీరోయిన్ కదా.. అందుకే శ్రద్ధ ఫోటోలు కూడా తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో పింక్ టీ షర్టు.. జేబులు..తాళ్ళు ఉన్న ఒక వెరైటీ క్యాజువల్ ప్యాంట్ ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి కారెక్కింది. ఇక టీ షర్టుకు వేసిన ముడి ఈ డ్రెస్ కు కాస్త రఫ్ లుక్ కూడా తీసుకొచ్చింది. నెయిల్స్ కు ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ తో డిఫరెంట్ టచ్ ఇచ్చింది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ కూడా ధరించింది. ఇక ఫోటోలు తీసేవారిని చూసి బెంచ్ ప్రెస్ చేసే సమయంలో జిమ్ము వీరులు పెట్టే ఎక్స్ ప్రెషన్ పెట్టకుండా మంచి స్మైల్ తో యోయో.. అంటూ ఒక రాక్ స్టార్ తరహాలో పోజిచ్చింది.

ఇక శ్రద్ధ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయం మాట్లాడుకుంటే వరుణ్ ధావన్ తో కలిసి 'స్ట్రీట్ డ్యాన్సర్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కాకుండా టైగర్ ష్రాఫ్ తో 'బాఘి 3' సినిమాలో కూడా నటిస్తోంది.