Begin typing your search above and press return to search.

శృంగార దానానికి శ్రద్ధ రెడీ

By:  Tupaki Desk   |   21 May 2018 4:42 AM GMT
శృంగార దానానికి శ్రద్ధ రెడీ
X
శ్రద్ధా దాస్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చాలా ఏళ్లయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటం గర్ల్ వరకు.. సపోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వరకు చాలారకాల పాత్రలే చేసింది. గ్లామర్ ఒలకబోసినా.. టాలెంట్ చూపినా కెరీర్ లో కోరుకున్న బ్రేక్ మాత్రం దొరకలేదు. బ్యూటీకి లోటు లేకపోయినా లక్ మాత్రం కలిసిరాక శ్రద్ధ లైమ్ లైట్ లోకి రాలేకపోయింది.

శ్రద్ధ దాస్ తనలో దాగున్న నటిని ప్రచంచానికి పరిచయం చేయాలన్న పట్టుదలతో ఓ బోల్డ్ డెసిషన్ తీసుకుంది. కెరీర్ లో ఇంతవరకు చేయని విధంగా ఓ వేశ్య పాత్ర చేయడానికి రెడీ అయింది. అది కూడా రెగ్యులర్ మూవీలో కాదు. ఓ షార్ట్ ఫిలింలో. సినిమాటోగ్రాఫర్ దీపక్ పాండే డైరెక్షన్ లో శృంగార్ దాన్ టైటిల్ తో తెరకెక్కే షార్ట్ ఫిలింలో ప్రాస్టిట్యూట్ గా కనిపించనుంది. 90ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో సాగే ఈ కథలో షాయిబా అనే యంగ్ బ్యూటిఫుల్ ప్రాస్టిట్యూట్ గా శ్రద్ధ దాస్ నటిస్తోంది.

హీరోయిన్ గా బ్రేక్ కోసం చూస్తున్న టైంలో షార్ట్ ఫిలింలో చేయడం.. అదీ వేశ్య పాత్ర చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ పాత్ర ఛాలెంజింగ్ అనిపించడం వల్లనే చేస్తున్నా అని చెప్పుకొచ్చింది శ్రద్ధ దాస్ ‘‘షాయిబా క్యారెక్టర్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాత్ర చేయడం అంటే నాలోని నటికి కొత్త ఛాలెంజ్ లాంటిదే. ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నా’’ అంటోంది శ్రద్ధ దాస్. చూద్దాం... శృంగార్ దాన్ లో శ్రద్ధ దాస్ ఏ రేంజిలో మెరిపిస్తుందో?