Begin typing your search above and press return to search.

బాల‌య్య... శ్ర‌ద్ధాదాస్‌ తో!

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:43 AM GMT
బాల‌య్య...  శ్ర‌ద్ధాదాస్‌ తో!
X
బాల‌కృష్ణ కొత్త సినిమా డిక్టేట‌ర్‌ లో గ్లామ‌ర్ డోసు మామూలుగా లేదు. ముగ్గురు హీరోయిన్ల‌తో పాటు ఇద్దరు ఐటెమ్ గాళ్స్ ఉన్నారు. అంటే మొత్తం ఐదుగురు భామ‌ల‌తో క‌లిసి బాల‌య్య తెర‌పై హ‌ల్ చ‌ల్ చేయ‌బోతున్నార‌న్న‌మాట‌. మొద‌ట అంజ‌లి - సోనాల్ చౌహాన్‌ ల‌ని క‌థానాయికలుగా ఎంచుకున్నారు. ఆ త‌ర్వాత అక్షని ఎంపిక చేసుకొన్నారు. అయితే ఈ ముగ్గురితో పాటు మ‌రో ఐటెమ్ భామ‌కి కూడా చోటుంద‌ని చిత్ర‌బృందం ఆమ‌ధ్య హింట్ ఇచ్చింది. ఆ ఐటెమ్ పాట‌ని భారీగా ప్లాన్ చేసిన‌ట్టు కూడా ఆమ‌ధ్య వార్త‌లొచ్చాయి.

ఐటెమ్ పాట కోసం గోవా కోవా ఇలియానాని కూడా సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. మ‌రి ఏమైందో తెలియ‌దు కానీ... ఆ ప్లేస్‌ లోకి శ్ర‌ద్ధాదాస్ వ‌చ్చింది. శ్ర‌ద్ధాదాస్‌ తో పాటు మ‌రో హీరోయిన్ కూడా ఆ పాట‌లో న‌టిస్తోంద‌ని స‌మాచారం. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌ర‌న్న విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. ప్ర‌స్తుతం డిల్లీలో ఆ పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. డిసెంబ‌రు 3 వ‌ర‌కు అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు. 4 నుంచి హైద‌రాబాద్‌ లో ఫైట్‌ ని చిత్రీక‌రించ‌బోతున్నారు. దాంతో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఏరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.