ఫోటో స్టోరి: బొద్దుగా శ్రద్ధగా

Mon Dec 10 2018 12:52:34 GMT+0530 (IST)

మిస్టర్ పెర్ ఫెక్ట్ .. మిస్టర్ పెర్ ఫెక్ట్ .. అంటూ `ఆర్య-2`లో శ్రద్ధాదాస్ మెరిపించిన మెరుపులు మెగాభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించినా కిరాక్ పుట్టించే సీన్లతో శ్రద్ధా మైమరిపించింది. టాలీవుడ్‌లో దశాబ్ధం పాటు సుదీర్ఘమైన కెరీర్‌ని సాగించినా ఎందుకనో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. 2008లో సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో తెరకు పరిచయమై అటుపై రెండు డజన్ల సినిమాల్లో నటించింది.  ఈఏడాదితో శ్రద్ధ కెరీర్ పదేళ్లు పూర్తవుతోంది. చివరిగా పీఎస్‌వి గరుడ వేగ చిత్రంలో మాలిని పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం ఉత్తరాదిన లఘు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.2017లో `బాబూమోషాయ్ బందూక్ బాజ్` అనే హిందీ సినిమాలో నటించి బాలీవుడ్ లో సందడి చేసింది. గత ఏడాది అసలు టాలీవుడ్ లో సినిమాలే లేవు. డిక్టేటర్ - బాద్ షా లాంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో మెప్పించిన శ్రద్ధా ఆ తర్వాత అసలు అవకాశాలు అందుకోవడంలో తడబడింది. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో అవకాశం అందుకుంది. కోటిగొప్ప 3 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆన్ సెట్స్ ఉంది.

ఈలోగానే ఇదిగో ఇలా గొంతు సవరిస్తున్నా! అంటూ ఓ పాట కూడా పాడేసింది. సాంగ్ రికార్డింగ్ వేళ రికార్డింగ్ స్టూడియోలో దిగిన ఫోటోల్ని శ్రద్ధ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేసింది. శ్రద్ధలో నటి మాత్రమే కాదు అభినవ గాయని కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ గాయనికి పని పెడుతూ కొత్తగా రాణించాలనుకుంటుందేమో? అన్న సందేహాలు కలుగుతున్నాయి. పూణే ఫిడిల్ క్రాఫ్ట్ -ఎన్ డి స్టూడియోలో అమిత్ అధికారి సంగీత సారథ్యంలో తన కెరీర్ తొలి పాటను ఆలపించానని శ్రద్ధ దాస్ మురిపెంగా చెప్పుకుంది. అయితే ఇటీవల మారిన గెటప్ ఆకట్టుకుంటోంది. బొద్దుగా ఉన్నా.. ముద్దొస్తూ మన దర్శకనిర్మాతలకు దర్శనమిస్తోంది. ఇలా అయితే అనవసరంగా ఛాన్సులిచ్చి ఎంకరేజ్ చేస్తారేమో?