Begin typing your search above and press return to search.

మేకింగ్ లోనే తెలిసిపోతోన్న శ్రద్ధ!!

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:10 AM GMT
మేకింగ్ లోనే తెలిసిపోతోన్న శ్రద్ధ!!
X
షూట్ పై ఎంత శ్రద్ధ పెట్టిందంటే!! హాట్ బ్యూటీ అనిపించుకునేందుకు ఏ మాత్రం అభ్యంతరాలు లేని భామల్లో శ్రద్ధాదాస్ పేరు చెప్పకపోతే ఆ లిస్ట్ కంప్లీట్ అవదంతే. అంతగా తన అందాలను ఆరబోసే ఈ భామ.. ఏ రేంజ్ లో రెచ్చిపోగలదో.. రీసెంట్ గా గుంటూరు టాకీస్ రివాల్వర్ రాణిలో కళ్లకు కట్టినట్లు చూపించేసింది.

ఆ సినిమా ఎంతగా కాసులు కురిపించినా.. శ్రద్ధాదాస్ రోల్ కి ఎన్ని పొగడ్తలు వచ్చినా.. తర్వాత ఛాన్సులు మాత్రం రాలేదు. అలాగని డిజప్పాయింట్ అయిపోయే బాపతు కాదులెండి. ఎందుకంటే తెలుగులో ఆఫర్లు రాకపోయినా.. రీసెంట్ గా బెంగాలీలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించేసింది. మన డాన్ శీనుని అక్కడ బాద్షా దిడాన్ పేరుతే తీయగా.. అందులే శ్రద్ధాదాస్ లీడ్ రోల్ చేసేసింది. బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మస్తీ నిరాశపరిచినా.. అమ్మడికి కావాల్సిన గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. ఈ క్రేజ్ ని అంచెలంచెలుగా పెంచేందుకు ఫోటో షూట్స్ రూట్ లోకి వెళ్లింది శ్రధ్ధా.

ఈ ఫోటో షూట్ కి మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసి కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మధ్య మేకింగ్ వీడియోలు బాగా ట్రెండింగ్ అవుతుండడంతో.. ఆ రూట్ లో కూడా తన అందాల ఆరబోతను.. షూటింగ్ లో తన ఎంత బోల్డ్ గా ఉండగదలదనే విషయాన్నే.. కళ్లకు కట్టి చూపించిందీ భామ. ఏమైనా శ్రద్ధా దాస్ శ్రద్ధ పెట్టిందంటే.. ట్రెండ్ ని క్యాచ్ చేయడం అంత కష్టమేం కాదు లెండి.