Begin typing your search above and press return to search.

అయ్యో శ్రద్ధా.. ఇది కూడా వేస్టయిందే

By:  Tupaki Desk   |   25 July 2016 9:30 AM GMT
అయ్యో శ్రద్ధా.. ఇది కూడా వేస్టయిందే
X
కొందరికి అన్నీ ఉన్న అదృష్టం మాత్రం ఉండదు. కెరీర్ గాడిన పడ్డానికి ఒడ్డున పడ్డానికి అదే పెద్ద సమస్య అవుతూ ఉంటుంది. ముంబైలో పుట్టిన బెంగాలీ బామ శ్రద్ధా దాస్ పరిస్థితి ఇలానే ఉంటుంది. అమ్మడికి ఏ విషయంలోనూ లోటుండదు. అటు యాక్టింగ్ నుంచి ఇటు ఎక్స్ పోజింగ్ వరకూ ఓ విషయంలోనూ లోటు చేయదు. అయినా సరే.. టైమ్ మాత్రం కలిసి రాదు. వీటికి తోడు టైమింగ్ ప్రాబ్లెంతో.. ముందుగా వేసుకున్న ప్లాన్స్ కూడా దెబ్బ వేస్తుంటాయి.

గ్రేట్ గ్రాండ్ మస్తీపై ఈ భామ చాలానే శ్రద్ధ పెట్టినా.. ఆ మూవీ గ్రేట్ డిజాస్టర్ గా మారిపోయింది. ముందే లీకవ్వడం ఒక సమస్య అయినా.. కంటెంట్ కూడా గొప్పగా ఏమీ లేకపోవడం మరో కారణం. ఆ మూవీ ప్రచారం సమయంలోనే విడుదల చేసేలా ఓ ఫోటో షూట్ ని కూడా చేసింది శ్రద్ధా దాస్. పాత తరం హీరోయిన్లను తలపించే గెటప్ తో.. ఓల్డ్ మోడల్ ఫోన్ మాట్లాడుతున్న మోడ్రన్ వయ్యారిగా కనిపిస్తుంది ఈ సొగసరి. బాగా ఫోటో ఫ్రెండ్లీ కేరక్టర్ కావడంతో.. కెమేరాలకు తగినంత పని ఇచ్చేస్తూ ఉంటుంది.

ఫోటో షూట్ లో శ్రద్ధా దాస్ గెటప్ గ్లామర్ బాగున్నా.. మొత్తానికి మాత్రం ఈ షూట్ వేస్టయ్యింది. గ్రేట్ గ్రాండ్‌ మస్తీ ఫ్లాపైంది. అవకాశాలు కూడా మొహం చాటేస్తున్న పరిస్థితుల్లో శ్రద్ధా కెరియర్‌ పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు శ్రద్ధ దేనిపై శ్రద్ధ పెడుతుందో!