Begin typing your search above and press return to search.

శ్ర‌ద్ధా చేతికి ఎంత ఖ‌రీదైన వాచ్ అంటే..?

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:35 AM GMT
శ్ర‌ద్ధా చేతికి ఎంత ఖ‌రీదైన వాచ్ అంటే..?
X
ఒక‌ప్పుడు త‌న అందంతో మెరుపులు మెరిపించి.. గ్లామ‌ర్ ఒల‌క‌బోసి కుర్రకారు కంటికి నిద్ర లేకుండా చేసిన చిన్న‌ది శ్ర‌ద్ధాదాస్‌. గాయ‌నిగా.. న‌టిగా ఒక‌ప్పుడు య‌మాస్పీడ్ గా ఉన్న ఆమె త‌ర్వాతి కాలంలో తెర మ‌రుగైంది. అయిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్ప‌డు కొన్ని ఈవెంట్ల‌లో మెరుపులా మెరుస్తుంది.

అవ‌కాశాలు అంతంత‌మాత్రంగా ఉన్నా.. గ్లామ‌ర్ మొయింటైన్ చేసే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా శ్ర‌ద్ధ‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. తాజాగా ఆమె ఒక వాచ్ ను ప్ర‌మోట్ చేసే ప‌నిలో ప‌డ్డారు. అంత‌ర్జాతీయంగా ఫేమ‌స్ అయిన చోపార్ట్ సంస్థ‌కు చెందిన ఒక వాచ్ ను ఆమె ఆవిష్క‌రించారు.

ఈ వాచ్ కు బోలెడ‌న్ని ప్ర‌త్యేక‌త‌లు. రేటు మొద‌లుకొని దాని డిజైన్ వ‌ర‌కూ అన్ని ప్ర‌త్యేక‌త‌లే. ఇంత చెబుతున్నారు వాచ్ రేట్ ఎంతంటారా? జ‌స్ట్ రూ.2.6 కోట్లు మాత్ర‌మే. అంత ఖ‌రీదా? అందులో ఏం ఉంటుందంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

ఈ స్పెష‌ల్ వాచ్ లో మొత్తం 612 డైమండ్స్ ను వాడిన‌ట్లు చెబుతున్నారు. 160.9 గ్రాముల బంగారంతో పాటు.. వైట్ గోల్డ్ ను కూడా వాడేశారు. లిమిటెడ్ ఎడిష‌న్లో ఉండే ఈ ఖ‌రీదైన వాచ్ మ‌గువుల చేతికి మ‌రింత అందాన్ని తెస్తుంని చెబుతున్నారు. కోట్లాది రూపాయిల వాచ్ అంటే ఆమాత్రం అందంగా ఉండ‌కుండా ఉంటుందా? వాచీ అంద‌మేమో కానీ.. దాని ధ‌ర విన్నాక మాత్రం రెట్టింపు అందంగా క‌నిపించ‌టం ఖాయం.