నా సెక్సీ డాన్స్ చూడండి అక్కడ

Fri Aug 11 2017 10:13:16 GMT+0530 (IST)

నవాజుద్దీన్ సిద్దిఖి హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా బాబూమోషాయ్ బందూక్ బాజ్ సినిమా ఆగష్టు 25 న విడుదలకాబోతుంది. ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటు శృతి మించిన సెక్స్ సీన్లు ఉండటం చేత సెన్సర్ బోర్డు వాళ్ళు ఈ సినిమా పై తీవ్ర నిరసన తెలిపారు. ఈ సినిమా వివాదాలు ఎలా ఉన్న ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు మాత్రం వాళ్ళ అందాలతో ప్రేక్షకులకు రతీదేవిని తలపించే విదంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ముందు ఒక పాట విడుదల చేసి సినిమాలో హీరో హీరోయిన్లు మధ్య ఏ స్థాయి రొమాన్స్ ఉండబోతుందో చెప్పేశారు. ఆ సాంగ్ లో ఒక హీరోయిన్ బిదితా బాగ్ తో హీరో చేసిన రొమాన్స్ పెద్ద దుమారమే లేపింది.

ఇప్పుడు ఈ సినిమాలో మరో సెక్సీ బ్యూటీ శ్రద్ధా దాస్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ఒక బి-గ్రేడ్ భోజ్ పురి నటిగా కనబడుతుందట. ఈమెపై ‘ఘుంజాత’ అంటే పాట ఒకటి ఉంటుంది. ఈ పాటలో శ్రద్ధా చేసిన డాన్స్ అందరికి పెద్ద షాక్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఒక వీదిలో వచ్చి ఆడే డాన్సర్లా పూర్తిగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని వంటపట్టించుకొని మోటుగా పల్లెటూరి డాన్సర్ గా కనిపించి తన అందం పురివిప్పి కొత్త రూపాన్ని తీసుకువచ్చిందట. పాటలో నాటు బీట్ కి శ్రద్ధా దాస్ డాన్స్ ఈ సినిమాకే హైలైట్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ పాటలో ఆమె వేసుకొన్న బట్టలు కూడా అందాలను మరింత అందంగా చూపే విదంగా ఉన్నాయి. ఈ సినిమాలో యాస్మిన్ అనే అమ్మాయి పాత్రలో నటిస్తుందటలే.

ఈ పాత్రలో చాలా రకాల భావాలను పలికించే అవకాశం దక్కింది నాకు అని చెబుతూ.. ‘ఘుంజాతా’ సాంగ్ చేయడం చాల కష్టంగా ఉన్నా.. ఇటువంటి ఐటెమ్ సాంగ్  ఇంతకు ముందు బాలీవుడ్ సినిమాలో చూసి ఉండరు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది అని హొయలు పోతోంది. ఆమె వలికించే అందాలన్నీ ఆ ఫోటోలో కనిపిస్తున్నాయిలే.