సోనుపై సెక్సీ శ్రద్ధ ఏమందంటే..

Thu Apr 20 2017 22:22:03 GMT+0530 (IST)

సింగర్ సోను నిగమ్ సృష్టించిన వేడి ఇంకా తగ్గలేదు. ఉదయాన్నే వినిపించే మతాచారమైన అజాన్ ను కామెంట్ చేస్తూ.. నిద్ర పాడవుతోందని కామెంట్ చేసిన సోను నిగమ్.. క్షమాపణ చెప్పేందుకు కూడా నిరాకరించడంతో.. వేడి మరింతగా రాజుకుంది. ఇప్పుడు సోను పక్కింటిలో ఉండే ఓ వ్యక్తి ఆశ్చర్యకమైన కామెంట్స్ చేయడం విశేషం.

ఇంతకీ ఆ పక్కింటిలో ఉండేదెవరో కాదు.. సెక్సీ హీరోయిన్ శ్రద్ధ దాస్. పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఈమె.. ఫేస్ బుక్ సాక్షిగా కొన్ని కామెంట్స్ చేసింది. "సోనూ నిగమ్ ఇంటి బయట బోలెడన్ని పోలీస్ వ్యాన్స్.. అనేక మంది మీడియా జనాలు ఉన్నారు. నేను వాళ్లింటి పక్కనే ఉంటా.. మా ఇంటి కిటికీ నుంచి చూడగలను. విచిత్రం ఏంటంటే.. కొన్ని రోజులుగా మా ఇంటి దగ్గర ఉదయాన్నే అజాన్ వినిపించడం లేదు. నిజానికి కచ్చితంగా వినిపించాల్సిందే. తను తన తల నరికేసుకున్నాడని వింటున్నా. అందుకే మా ఇంటి బయట ఇంత ట్రాఫిక్" అంటూ పోస్ట్ చేసింది.

అయితే.. అంతలోనే ఇది వైరల్ గా స్ప్రెడ్ అవడంతో తన పోస్ట్ ను డిలెట్ చేసేసింది శ్రద్ధ. ఈమె చేసిన పని కారణంగా.. ఇప్పుడు సోనూ నిగమ్ ఇష్యూ మరింత పెద్దదయినా ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/