Begin typing your search above and press return to search.

షాకిస్తున్న డే -1 ఇస్మార్ట్ బుకింగ్స్‌!

By:  Tupaki Desk   |   16 July 2019 4:51 AM GMT
షాకిస్తున్న డే -1 ఇస్మార్ట్ బుకింగ్స్‌!
X
ఇండ‌స్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్ట‌ర్ గా పూరి జ‌గ‌న్నాథ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు.. మంచి బాలుడు.. కానీ పూరి ఎంట‌రైన త‌రవాత మొత్తం సీన్ మారింది. తెలుగు సినిమా హీరో అంటే ఓ ఇడియ‌ట్‌.. ఓ పోకిరి..ఓ దేశ ముదురు.. అనే ట్రెండును తెచ్చింది ఆయ‌నే. అయితే ఎన్నో ఇండ‌స్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరీకి ఇటీవ‌ల స‌రైన హిట్ అన్న‌దే లేదు. ఆ మాట విని చాలా రోజులే అవుతోంది. ప‌క్కాగా చెప్పాలంటే పూరి ప‌ని అయిపోయింది. అత‌నిలో స‌త్తా అంతా నీరుగారిపోయింది. అవే మూస క‌థ‌లు.. అదే టేకింగ్ అనే ముద్ర‌ప‌డిపోయింది. దాన్నుంచి బ‌య‌టికి రావాల‌న్న ప్ర‌య‌త్నంలో పూరి జ‌గన్నాథ్ చాలానే ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాంటి ప్ర‌య‌త్న‌మే అత‌డు తెర‌కెక్కించిన తాజా సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఫ్లాపుల్లో వున్న పూరీ.. అదే రేంజ్ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రామ్ క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంలో ఏంటీ వీళ్ల ధీమా? అని అంద‌రిలో ఆశ్చ‌ర్యం మొద‌లైంది.

పూరి చెప్పిన క్యారెక్ట‌ర్ పిచ్చి పిచ్చిగా న‌చ్చేయ‌డంతో చాలా కాలంగా ఇలాంటి క్యారెక్ట‌ర్ కోసం ఎదురుచూస్తున్న రామ్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఈ చిత్రాన్ని అంగీక‌రించాడట‌. అయితే పూరి సినిమా అంటే ఆ ఏముంటుందిలే అని పెద‌వి విరిచిన వారే తొలి టీజ‌ర్ లో రామ్ క్యారెక్ట‌ర్.. అత‌ని బాడీ లాంగ్వేజ్‌.. ప‌క్కా హైద‌రాబాదీ యాస చూసి అవాక్క‌య్యారు. టీజ‌ర్ పై మొద‌ట్లో మిశ్ర‌మ స్పంద‌నే ల‌భించినా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పూరి- రామ్ క‌లిసి ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నారా అని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తుతోంది. ఈ గురువారం (18న) సినిమా విడుద‌లవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సెన్సార్ బృందం ఈ చిత్రానికి `ఏ` స‌ర్టిఫికెట్ ఇచ్చింది. మాసీగా ఉండే ఈ సినిమాలో రొమాన్స్ హ‌ద్దు మీరింద‌న్న‌ది టీజర్ తోనే తేలింది. ఘాటైన డైలాగుల‌తోనూ పూరీ మోతెక్కించాడు. క‌థానాయిక‌ల బోల్డ్ కంటెంట్ పై జ‌నం విరుచుకుప‌డుతున్నా అదే ఇప్పుడు ఇస్మార్ట్ బాక్సాఫీస్ కి క‌లిసిరానుంద‌ని ఆన్ లైన్‌ బుకింగ్ కౌంట‌ర్ చెబుతోంది. ఇప్ప‌టికే డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో షాకిస్తున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌ల కాలంలో పూరి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లేవు. కానీ ఈ సినిమాకి మాత్రం జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. దీనికి సంకేతం పూరి మ‌ళ్లీ త‌న స‌త్తాను చాటుకుంటున్నార‌నా?.. ఫ్లాపుల్లో వున్న పూరి- రామ్ ఈ సినిమాతో తామేంటో చూపించ‌బోతున్నారా? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ఆ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో పూరి-రామ్ బ‌దులు చెప్ప‌బోతున్నార‌ని చిత్ర బృందం చెబుతోంది. ఆ మాట‌ల్లో నిజ‌మెంత అన్న‌ది చూడాలి. డే1.. తొలి వీకెండ్ ఇస్మార్ట్ బుకింగ్స్ లో ఉన్న స్పీడు అలాగే కంటిన్యూ అవుతుందా? అన్న‌ది తెలియాలంటే ఫ‌లితం వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.