Begin typing your search above and press return to search.

రోబోతో పులికి పోలికేంటి మ్యాడ‌మ్‌?

By:  Tupaki Desk   |   4 Oct 2015 1:30 AM GMT
రోబోతో పులికి పోలికేంటి మ్యాడ‌మ్‌?
X
రోబో త‌ర్వాత మా సినిమాకి అసాధార‌ణ‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ద‌శావ‌తారం - తుపాకి త‌ర్వాత మ‌రో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టేశాం అని చెబుతున్నారు ఎస్వీఆర్ మీడియా అధినేత్రి శోభారాణి. ఇలయదళపతి విజయ్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి కీలకపాత్రలో - శ్రుతిహాసన్‌ - హన్సిక కథానాయికలుగా చింబుదేవన్‌ దర్శకత్వంలో శిబుతమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మించిన 'పులి' చిత్రం తెలుగు, తమిళ్‌ లో రిలీజై ఘనవిజయం సాధించింద‌ని శోభారాణి చెబుతున్నారు.

వాస్త‌వంగా ఇది నిజ‌మేనా? అస‌లు పులి ఎప్పుడు రిలీజైంది? అన్న సంగ‌తి బైటి జ‌నాల‌కు తెలియ‌నేలేదింకా. కానీ అప్పుడే పులి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అంటూ ప్ర‌చారం మొద‌లెట్టేశారు. 250 థియేట‌ర్లు పెంచేస్తున్నామంటూ హంగా మా మొద‌లెట్టేశారు. కార‌ణం ఏదైనా ఐటీ రెయిడ్స్ పుణ్య‌మా అని పులి నిర్మాత‌లంతా బెంబేలెత్తిపోయారు. అందుకే ఇలా శోభారాణి వెంట‌నే ప్రెస్‌ మీట్ పెట్టి హ‌డావుడి చేసేస్తున్నార‌ని ముచ్చ‌టించుకోవ‌డం విశేషం. వాస్త‌వానికి పులి చిత్రానికి కూడా రోబో అంత క్రేజు వ‌చ్చినా.. మొద‌టిరోజు రిలీజ్ ఆగిపోవ‌డం పెద్ద శాప‌మైంద‌నే చెప్పాలి. అది ఓపెనింగ్స్‌ పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. కోట్ల‌లో ఆర్థిక న‌ష్టాన్ని క‌లిగించింది.

సక్సెస్‌ మీట్‌ లో శోభారాణి మాట్లాడుతూ.. ''మా సంస్థ నుంచి వచ్చిన పులి హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. తెలుగులో ఒకరోజు ఆలస్యంగా రిలీజైనా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుని పెద్ద విజయం సాధించింది. పులి ఓ విజువల్‌ వండర్‌. పిల్లలు - ఫ్యామిలీస్‌ ఎగబడి థియేటర్లలో చూస్తున్నారు. ఇటీవలి కాలంలో రోబో పెద్ద హిట్‌ అవ్వడానికి పిల్లలు, ఫ్యామిలీస్‌ ఆదరించడం వల్లే. తెలుగులో లవకుశ అప్పట్లో అంత పెద్ద విజయం సాధించింది. మా సంస్థ నుంచి దశావతారం రిలీజ్‌ చేసినప్పుడు ఆ సినిమా గురించి అందరూ మాట్లాడారు. రిలీజైన ప్రతిచోటా హౌస్‌ ఫుల్స్‌ తో మా చిత్రం నడుస్తోంది'' అంటున్నారు ఆమె. సర్లేండి.. ఇక సినిమా ఎలా ఆడుతుందో అందరికి తెలిసిందేగా!!