ఫోటో స్టోరి: శివాని అందం అదిరింది

Tue Apr 17 2018 12:03:58 GMT+0530 (IST)

ఒక్కోసారి అందం అనే పదం ఒక అమ్మయితోనే మొదలైందా అని అనిపిస్తుంది. అందమంటే ఒక అమ్మాయితో స్వచ్ఛమైన నవ్వు కన్నా మరో ఒరిజినల్ కాస్ట్యూమ్ ఉండదు. అందులోను ట్రెడిషినల్ గా కనిపించి కొంచెం సిగ్గును జోడించి అనుకువుగా ఉన్నట్లు కనిపిస్తే ఎంతటివారైనా గౌరవంతో అందంగా ఉన్నారు అనకుండా ఉండలేరు. ప్రస్తుతం అలాంటి అమ్మాయిలు కనిపించట్లేదు అనే వారికి మన తెలుగమ్మాయిలు సమాధానం ఇస్తున్నారు.రీసెంట్ గా రాజశేఖర్ కూతురు శివాని కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరు ఆకర్షితులు అవుతున్నారు. ఇటీవల జరిగిన ఫ్యాషన్ షోలో అమ్మడు ర్యాంప్ పై  శివాని అందంగా కనిపించింది. ముఖ్యంగా ట్రెడిషినల్ మెరూన్ కలర్ డ్రస్ లో ఆమె  లుక్ లో అదిరిపోయింది. ర్యాంప్ పై చేసిన వాక్.. యాంటిక్ జ్యూయలరీ.. ముక్కుపడక.. వంటి అంశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మరి గ్లామర్ టచ్ కొంచెమైనా లేకపోతే ఎలా అనుకుందో ఏమో గాని కాస్త క్లివేజ్ గ్లామర్ యాడ్ చేసింది.

ప్రస్తుతం శివానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శివాని తన మొదటి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమా 2 స్టేట్స్ కథను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ - ఆలియా భట్ బాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా నటించి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే పేరుతో వస్తోన్న సినిమాలో అడివి శేష్ - శివాని జంటగా నటిస్తున్నారు.