Begin typing your search above and press return to search.

నిన్నుకోరి ద‌ర్శ‌కుడి తదుపరి..

By:  Tupaki Desk   |   23 Jan 2018 9:03 AM GMT
నిన్నుకోరి ద‌ర్శ‌కుడి తదుపరి..
X
త‌న తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. నాని - నివేదా థామ‌స్‌ - ఆది పినిశెట్టితో ఆయ‌న తీసిని నిన్ను కోరి... 2017 హిట్ సినిమాల‌లో ఒక‌టిగా మారింది. క్లాస్ ఆడియెన్స్‌ కు ఆ సినిమా తెగ‌న‌చ్చేసింది. క‌థ పాత‌దే అయినా... కొత్త‌గా చూపించి స‌క్సెస్ సాధించారు. ఆ స‌క్సెస్ ఇప్పుడు యంగ్ హీరోల‌కు శివ నిర్వాణ‌ను ఫ‌స్ట్ ఛాయిస్ గా మార్చింది. ఇంతకీ ఇతడి తదుపరి సినిమాతో ఎవ్వరితో చేస్తున్నాడో తెలుసా?

చాలా కథలు విన్న తరువాత.. అక్కినేని నాగ‌చైత‌న్య త‌న త‌రువాతి సినిమాకు శివ‌కే అవ‌కాశం ఇచ్చిన‌ట్టు టాక్. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ వ‌ర్క్ కూడా స‌గం మేర‌కు పూర్త‌యింది. మ‌రో నెల రోజుల్లో పూర్తి స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్తయిపోతుంది. స్క్రిప్టంతా నాగ‌ చైత‌న్య‌కు న‌చ్చితే... త‌రువాత షూటింగ్ మొద‌లైపోతుంది. కోన వెంక‌ట్ శివ‌కు రైటింగ్‌ లో స‌హ‌క‌రిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే నిన్నుకోరి సినిమాను ప్రొడ్యూస్ చేసిన డివీవీ దాన‌య్యే ఈ సినిమాకు కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన స‌వ్య‌సాచి షూటింగ్ పూర్తి కావొచ్చింది. మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు కూడా కొబ్బ‌రి కాయ కొట్టేశాడు. ఆ సినిమా శైల‌జా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌ గా చేస్తుండ‌గా, రమ్యకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది.