Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: నామినేష‌న్ లో ర‌చ్చ‌.. రచ్చ: వరుణ్ వ‌ర్సెస్ శివ‌జ్యోతి

By:  Tupaki Desk   |   15 Oct 2019 5:06 AM GMT
బిగ్‌ బాస్‌: నామినేష‌న్ లో ర‌చ్చ‌.. రచ్చ: వరుణ్ వ‌ర్సెస్ శివ‌జ్యోతి
X
బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ‘టాపర్ ఆఫ్ ది హౌస్’ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఇంటి సభ్యులు లాటరీ పద్దతిలో వచ్చిన నెంబర్లు తీసుకుని - వారికొచ్చిన నెంబర్ ప్రకారం ఆయా స్థానాల్లో నిలబడాలి. ఇందులో 4 నుంచి 7 స్థానాల్లో ఉన్నవారు నామినేట్ అవుతారు. అయితే చివరి స్థానాల్లో ఉన్నవారు - టాప్3లో ఉన్నవాళ్లతో వాదించి - వాళ్ళకంటే తామే బెటర్ అని చెప్పి ఆ స్థానాలని దక్కించుకోవచ్చు.

ఇక టాస్క్ మొదలవ్వడమే లాటరీలో వచ్చిన నెంబర్లు ప్రకారం బాబా భాస్కర్-1 - రాహుల్-2 - వరుణ్-3 - అలీ-4 - శివజ్యోతి-5 - వితికా-6 - శ్రీముఖి-7 స్థానాల్లో నిలబడ్డారు. దీంతో చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు - టాప్3లో వారితో చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వితికాకు - వరుణ్ తన 3వ స్థానం ఇచ్చేసి - తాను 6వ స్థానంలోకి వెళ్ళాడు. వితిక పెద్ద క‌ష్ట‌ప‌డ‌కుండానే త‌న భార్య అన్న ఆలోచ‌న‌తోనే వ‌రుణ్ త‌న నెంబ‌ర్ 3 స్థానం త్యాగం చేసేశాడు.

తర్వాత శ్రీముఖి వచ్చి రాహుల్ తో వాదించింది. తనకంటే నువ్ ఎందులో బెటారో చెప్పాలని రాహుల్ ని డిమాండ్ చేసింది. రాహుల్ కూడా నువ్ ఎందులో బెట‌రో చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. ఇలా వీరిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకోవడంతో - శ్రీముఖి వేస్ట్ అనుకుని బాబాతో చర్చించింది.

ఇక బాబా.. నాకంటే నువ్వే బెటర్ అని నెంబర్1 స్థానాన్ని శ్రీముఖికు ఇచ్చేసి..తాను 7వ నెంబర్లోకి వెళ్ళాడు. ఆ త‌ర్వాత ఆలీ రాహుల్‌ ను క‌న్విన్స్ చేసుకున్నాడు. అలీ 2వ నెంబర్లోకి రాగా - రాహుల్ 4వ స్థానంలోకి వెళ్ళాడు.

తర్వాత శివజ్యోతి 3వ నెంబర్లో ఉన్న వితికాతో వాదించింది. ఈ క్రమంలో వరుణ్ పై మండిపడింది. గేమ్‌ ని గేమ్‌ లా ఆడకుండా వితికా కోసం మూడో స్థానం ఎలా ఇస్తావ్ అంటూ వరుణ్‌ ని ప్రశ్నించింది. ఈ ముగ్గురి మధ్య చర్చ ముదిరి వాదనగా మారడంతో ఒకర్నొకరు దూషించుకున్నారు. కంత్రీ ఆట ఆడుతుందని వరుణ్ అనడంతో శివజ్యోతి సీరియస్ అయ్యింది. ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఎదురుతిరిగింది. మొత్తానికి వీరి చర్చకు తెరపడకపోవడంతో బిగ్ బాస్ ఏడుగురు సభ్యులని నామినేషన్ లో పెట్టాడు.