పిక్ టాక్: ఈ సొగసుకు 42 ఏళ్లా?

Mon Jul 17 2017 17:22:12 GMT+0530 (IST)

హీరోయిన్లు 20-25 ఏళ్ల మధ్య ఉన్నంత అందంగా ఆ తర్వాత కనిపించరు. వయసు పెరిగే కొద్దీ సొగసు తగ్గుతుంటుంది. కొందరు 30ల్లోకి రాగానే అదోలా తయారవుతారు. ముఖంలో గ్లో పోతుంది. బాడీలో పటుత్వం తగ్గుతుంది. వయసు ప్రభావంతో గ్లామర్ దెబ్బ తిన్న చాలా మంది హీరోయిన్లను మనం చూడొచ్చు. అందుకు బాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. కానీ 40ల్లోకి వచ్చాక కూడా ఫిజిక్ మెయింటైన్ చేయడం.. గ్లో కోల్పోకపోవడం.. కుర్ర హీరోయిన్లకు దీటుగా గ్లామర్ ప్రదర్శించడం అందరి వల్లా అయ్యే పని కాదు. అందుకు శిల్పా శెట్టి లాగా స్పెషల్ అయి ఉండాలి. ఈ మధ్యే ఒక హాట్ హాట్ ఫొటో షూట్లో క్లీవేజ్ అందాల్ని ఎలివేట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది శిల్పా. దాని గురించి ఇంకా డిస్కషన్లు నడుస్తుండగానే.. ఇప్పుడు న్యూయార్క్ వేదికగా జరుగుతన్న ఐఫా అవార్డుల వేడుకలో తనదైన శైలిలో కనిపించి ఆశ్చర్యపరిచింది శిల్పా. ఆమె వేసుకున్న డ్రెస్.. ఆమె గ్లామర్ చూసి యంగ్ హీరోయిన్లు కూడా కుళ్లుకునే పరిస్థితి.

ఆ అవార్డుల వేడుకకు తనే ప్రత్యేక ఆకర్షణ అనిపించేలా ముస్తాబై వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది పొడుగు కాళ్ల సుందరి. కొత్తవాళ్లెవరైనా ఆమె వయసు 42 ఏళ్లంటే అస్సలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తానికి యోగా మహిమతో శిల్పా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.