సాగర కన్య స్టన్నింగ్ టూపీస్ లుక్

Wed Jun 12 2019 16:54:30 GMT+0530 (IST)

'సాహసవీరుడు సాగరకన్య` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన శిల్పాశెట్టి సౌత్ లో ఏడెనిమిదేళ్ల పాటు తిరుగులేని హవా సాగించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పాటు తెలుగు- తమిళం-కన్నడ పరిశ్రమలకు శిల్పాశెట్టి సుపరిచితం. విక్టరీ వెంకటేష్ - మోహన్ బాబు- నాగార్జున- బాలకృష్ణ- ప్రభుదేవా లాంటి స్టార్ల సరసన నటించింది. అయితే కాలక్రమంలో బాలీవుడ్ వెళ్లి సెటిలైపోయాక.. అక్కడే బాంబే డైయింగ్ వస్త్ర వ్యాపారి.. ది గ్రేట్ బిజినెస్ మేన్ రాజ్ కుంద్రాని వివాహ మాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. శిల్పా శెట్టి కుంద్రాకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.అయితే మామ్ అయ్యాక కూడా శిల్పా శెట్టి టీనేజీ గాళ్ తరహాలో తీగలాంటి ఆకృతిని మెయింటెయిన్ చేయడం బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. తన వయసును సగానికి సగం తగ్గించేయడంలో శిల్పా హార్డ్ వర్క్ డెడికేషన్ గురించి నిరంతరం యువతరంలో చర్చ సాగుతుంటుంది. యోగాలో ఇండియా బెస్ట్ టీచర్ అని మార్కెట్ లో అమ్ముడుపోయిన శిల్పా యోగా సీడీలు చెబుతాయి. 40 ప్లస్ వయసులోనూ శిల్పా సంథింగ్ హాట్. భాజీగర్ (1993) చిత్రంతో బాలీవుడ్ లో ఎంటరైన శిల్పాశెట్టి 2007లో బిగ్ బ్రదర్ బ్రిటీష్ రియాలిటీ షో విజేతగా నిలిచింది. ఆ క్రమంలోనే ఫిట్ నెస్- యోగా వీడియోలతో అసాధారణ పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ ఫేజ్ 3 ప్రపంచంలో ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇటీవలే భర్త పిల్లలతో కలిసి విదేశీ వెకేషన్స్ లో ఉన్న ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కించిన సంగతి తెలిసిందే.

తాజాగా శిల్పా శెట్టి ఫెమీనా మ్యాగజైన్ కవర్ పేజీపై టూపీస్ లో దర్శనమిచ్చిన తీరు యూత్ మతి చెడగొట్టింది. ఇద్దరు పిల్లల మామ్ ఇంత హాట్ గానా? అంటూ సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే శిల్పా తన వయసును సగానికి సగం తగ్గించేసుకుందా? అన్నంతగా ఆ మేకోవర్ మైమరిపిస్తోంది. దివిలో అమృతం తాగి భువికి దిగివచ్చిన దేవతా సుందరివా! అంటూ కనఫ్యూజ్ అయిపోతున్నారంతే!!